Colon Cancer: మారిన జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వైద్య రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు వస్తున్నా ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం మాత్రం క్రమంగా పెరుగుతోంది. పెద్దపేగు క్యాన్సర్ కేసులు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంచనా ప్రకారం, 2025లో దాదాపు 1 లక్ష 7 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని అంచనా. ఇది గతంలో 50 ఏళ్లు తర్వాత ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన యువకులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్న దానిపై ఇంకా స్పష్టంగా తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశం.
25
ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. చిన్న మార్పులైనా తేలికగా తీసుకుంటే పరిస్థితి కఠినంగా మారుతుంది. అందుకే కొన్ని లక్షణాలను లైట్ తీసుకోకూడదని అంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటినవారిలో కనిపించే నాలుగు కీలక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
35
కారణం లేకుండా అలసట
పెద్దప్రేగు క్యాన్సర్ మొదటగా రక్తహీనతను కలిగిస్తుంది. దీనివల్ల బలహీనత, శక్తి తగ్గిపోవడం, ఎప్పుడూ నిద్రమత్తు ఉండడం. ఏ పని చేయాలన్నా ఆసక్తిలేకపోవడం. ఇవి సాధారణ అలసటలా అనిపించినా, రక్తహీనత వెనుక కారణం క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ కణాలు శరీర ఉష్ణోగ్రతను పెంచే ప్రోటీన్లను విడుదల చేస్తాయి. దీనివల్ల రాత్రిపూట అనూహ్యంగా చెమటలు పడుతాయి. అయితే ఇది సాధారణ చెమటలు కాదు. తరచుగా, తీవ్రంగా ఉంటుంది. ఇక పేగు అలవాట్లలో మార్పు విషయానికొస్తే.. అకస్మాత్తుగా మలబద్ధకం, తరచూ విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎక్కువ కావడం కూడా లక్షణాలుగా చెప్పొచ్చు.
55
మలంలో రక్తం
ఇది పెద్దప్రేగు క్యాన్సర్‌కు అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. జాన్స్ హాప్కిన్స్ వైద్యుల అభిప్రాయం ప్రకారం. మలంలో రక్తం కనిపిస్తే, వరుసగా కొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే దానిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇది పేగులలో ఎక్కడో రక్తస్రావం జరుగుతోందని సూచిస్తుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.