నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?

Published : Sep 22, 2026, 10:32 AM IST

Side Stitch: నీళ్లు తాగిన వెంట‌నే ప‌రిగెత్తితే పొట్టకు ఒకవైపు, పక్కటెముకల కింద నొప్పి వస్తుంది. ఈ నొప్పిని సైడ్ స్టిచ్ (Side Stitch) అంటారు. ఇంత‌కీ నొప్పికి కార‌ణం ఏంటంటే? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
సైడ్ స్టిచ్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?

పరిగెత్తేటప్పుడు పొట్టకు ఒకవైపు, ముఖ్యంగా పక్కటెముకల కింద అకస్మాత్తుగా గుచ్చినట్లు లేదా మెలిపెట్టినట్లు నొప్పి రావడాన్ని సైడ్ స్టిచ్ అంటారు. కొందరిలో ఈ నొప్పి భుజం చివరి భాగం వరకు కూడా వ్యాపించవచ్చు. సాధారణంగా వేగం తగ్గించినప్పుడు లేదా పరిగెత్తడం ఆపినప్పుడు నొప్పి క్రమంగా తగ్గుతుంది. ఈ సమస్యకు ఒకే ఒక్క కారణం ఉందని వైద్య పరిశోధనలు ఇప్పటివరకు నిర్ధారించలేదు. అయితే పరిగెత్తేటప్పుడు శరీరం పదేపదే కదలడం, పొట్ట నిండుగా ఉండటం, పొట్ట లోపలి పొరపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో కీలకమైన డయాఫ్రాగమ్ కండరానికి సంబంధించిన సమస్యలు కూడా ఒక కారణం కావ‌చ్చ‌ని చెబుతారు.

25
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే ఎందుకు నొప్పి వస్తుంది?

ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగినప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆ వెంటనే వేగంగా పరిగెత్తితే శరీరం పైకి కిందికి కదులుతూ ఉంటుంది. దీనివల్ల పొట్టలోని అవయవాలు, వాటిని కప్పి ఉంచే పొరలపై ఒత్తిడి పెరిగి కొందరిలో నొప్పి రావచ్చు. మన పొట్టలోని అవయవాలను కప్పి ఉంచే పొరను పెరిటోనియం (Peritoneum) అంటారు. పరిగెత్తేటప్పుడు ఈ పొరపై ఒత్తిడి లేదా రాపిడి పెరగడం సైడ్ స్టిచ్‌కు ఒక కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే పరిగెత్తేటప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. డయాఫ్రాగమ్ అనే శ్వాస కండరం నిరంతరం పనిచేస్తుంది. ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడం, శ్వాస సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా అసౌకర్యం కలగవచ్చు. అయితే నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తిన ప్రతి ఒక్కరికీ ఈ నొప్పి వస్తుందని కాదు. వ్యక్తులను బట్టి దీని ప్రభావం మారుతుంది.

35
సైడ్ స్టిచ్ రావడానికి ఇతర కారణాలు ఏంటి?

నీళ్లు తాగడం మాత్రమే కాకుండా, మరికొన్ని అలవాట్లు కూడా ఈ నొప్పికి కారణం కావచ్చు. భోజనం చేసిన వెంటనే పరిగెత్తడం, కడుపు నిండుగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల అసౌకర్యం పెరగవచ్చు. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం వ‌ల్ల‌, అలాగే అలవాటు లేకుండా ఒక్కసారిగా వేగం పెంచడం వల్ల నొప్పి రావచ్చు. శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేయకుండా పరిగెత్తడం వల్ల ఇబ్బంది కలగవచ్చు. వీటితో పాఉట షుగ‌ర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ లేదా ఎక్కువ పరిమాణంలో ద్రవాలు తీసుకున్న వెంటనే వ్యాయామం చేయడం కొందరిలో అసౌకర్యాన్ని పెంచవచ్చు.

45
ఈ నొప్పి వస్తే ఏం చేయాలి? రాకుండా ఎలా నివారించాలి?

పరిగెత్తేటప్పుడు పక్కటెముకల కింద నొప్పి వస్తే దాన్ని భరించి పరిగెత్తడం కొనసాగించకూడదు. వెంటనే వేగం తగ్గించి, అవసరమైతే పరిగెత్తడం ఆపి విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. నొప్పి ఉన్న చోట చేతితో మెల్లగా ఒత్తవచ్చు. అలాగే నొప్పి ఉన్న వైపుణన‌కు వ్యతిరేక దిశలో శరీరాన్ని సున్నితంగా సాగదీయవచ్చు. నొప్పి తగ్గిన తర్వాతే మళ్లీ నెమ్మదిగా పరిగెత్తడం ప్రారంభించాలి.

ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా తాగకుండా, కొద్దికొద్దిగా తాగాలి. భారీ భోజనం చేసిన తర్వాత సాధారణంగా 2–3 గంటల విరామం ఇచ్చి వ్యాయామం చేయాలి. పరిగెత్తే ముందు 5–10 నిమిషాలు నెమ్మదిగా నడుస్తూ వార్మప్ చేయాలి. మొదట తక్కువ వేగంతో ప్రారంభించి క్రమంగా వేగాన్ని పెంచాలి. పరిగెత్తేటప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి సహజంగా శ్వాస తీసుకోవాలి. వ్యాయామం సమయంలో దాహం వేస్తే నీళ్లు తాగడం మానేయకూడదు. అవసరానికి తగినట్లు చిన్న గుక్కలుగా తాగాలి. వైద్య, క్రీడా నిపుణులు సూచించే ఈ పద్ధతులు నొప్పి తగ్గించడంలో, మళ్లీ వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

55
సైడ్ స్టిచ్ ప్రమాదకరమా? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

చాలా సందర్భాల్లో వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే వచ్చే సైడ్ స్టిచ్ ప్రమాదకరమైనది కాదు. పరిగెత్తడం ఆపిన తర్వాత నొప్పి తగ్గిపోతే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రతి పొట్ట నొప్పినీ సైడ్ స్టిచ్‌గా భావించకూడదు. నొప్పి తరచూ వస్తున్నా, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోయినా, తీవ్రంగా ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం, వాంతులు, పొట్ట వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథమిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories