Hair Fall Home Remedies: ప్రతి అమ్మాయి పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటుంది. అయితే, జుట్టు రాలడం అన్నది సమస్యగా మారింది. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ, ఇకపై జుట్టు రాలిపోతుందని కంగారు పడకుండా ఈ సింపుల్ చిట్కా ప్రయత్నించండి.
జుట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తుంది. పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, రసాయనాల వాడకం, చుండ్రు వంటివి కారణాలు కావచ్చు. ఈ సమస్యను మన వంటింట్లో ఉన్నఈ రెండు పదార్థాలు పరిష్కరిస్తాయి. ఇంతకీ ఈ పదార్థాలేంటీ ? వాటి వల్ల ఉపయోగాలేంటీ ? ఓ లూక్కేద్దామా..
24
జుట్టు రాలడాన్ని తగ్గించే బియ్యం నీరు, మెంతులు
బియ్యం నీళ్ళలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టుని దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. మెంతులతో కలిపి వాడితే జుట్టు మరింత ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. వీటిని జట్టుకు ఎలా పట్టించాలో? వాడే విధానం ఏంటో తెలుసుకుందాం..
34
బియ్యం నీళ్ళు, మెంతులు:
బియ్యం, మెంతులను విడిగా రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి. బియ్యం నీటిలో మెంతుల పేస్ట్ కలిపి మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టాలి.
వడగట్టిన మెంతి-బియ్యం ద్రావణంలో విటమిన్ E కాప్సూల్, కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనె కలపాలి. తలకు రాసి మర్దన చేయాలి. అరగంట తర్వాత షాంపూ, కండిషనర్‌తో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది.