మునుగాకులో అనేక విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ A, C, B1, B2, B3, B6, ఫోలేట్, E, K వంటి అనేక విటమిన్లు ఉంటాయి. పాలకంటే 4 రెట్లు కాల్షియం, అరటిపండుతో పోల్చితే 3 రెట్లు పొటాషియం, అలాగే ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పెరుగుతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉండే మునుగాకు, శక్తివంతమైన ప్రోటీన్ వనరుగా పనిచేస్తుంది.