Weight Loss: డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా? కారణాలివే!

Published : Jul 03, 2025, 10:19 AM IST

Weight Loss: ప్రస్తుతం చాాలామంది ఊబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది డైట్, వర్కౌట్లు తెగ చేస్తున్నారు. కానీ, అనుకున్న ఫలితాలు రాక బాధపడుతున్నారు.ఎటువంటి వర్కౌట్లు చేస్తే ఓవర్ వెయిట్ ను కంట్రోల్ చేయవచ్చు. 

PREV
18
బరువు తగ్గడం కష్టమా?

బరువు తగ్గడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. తక్కువ కేలరీలు తీసుకుంటున్నా? డైట్ పాటిస్తున్న ఎందుకు తగ్గట్లేదు? అనేది చాలా మందిలో ఉన్న సందేహం. కానీ బరువు తగ్గడం కేవలం కేలరీలపై మాత్రమే కాదు. ఆహార నాణ్యత, జీవనశైలి, నిద్ర, ఒత్తిడి స్థాయి, హార్మోన్ల సమతుల్యత, ఆరోగ్య పరిస్థితులు (థైరాయిడ్, PCOS) ఇవన్నీ ప్రభావం చూపుతాయి.వీటి గురించి వివరంగా తెలుసుకుందాం..  

28
ఆహారపు అలవాట్లు:

బరువు తగ్గడానికి కేలరీలు తగ్గించడం మాత్రమే సరిపోదు. ఏమి తింటున్నామో కూడా ముఖ్యం. 100 కేలరీల చాక్లెట్‌కి, 100 కేలరీల పండ్లకి తేడా చాలా ఎక్కువ. పండ్లు పోషకాలు, ఫైబర్‌తో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, చాక్లెట్‌లో శరీరానికి హానికరమైన చక్కెర, కొవ్వు ఉంటుంది. కాబట్టి కేవలం కేలరీలపై కాకుండా, తింటున్న ఆహార నాణ్యతపై దృష్టి పెట్టండి.

38
వ్యాయామం:

కేలరీలు తగ్గించడం ఒక్కటే కాకుండా, రోజూ వ్యాయామం కూడా అవసరం. నడక, సైక్లింగ్, యోగా వంటివి శరీరాన్ని చురుకుగా ఉంచి, కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారం, వ్యాయామం రెండూ సమతుల్యంగా ఉండాలి.

48
నిద్రలేమి:

నిద్రలేమి శరీరంలోని ఆకలికి సంబంధించిన హార్మోన్లు, జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. శరీరం సరిగా పనిచేయాలంటే ప్రతి రోజు కనీసం 7–8 గంటలు నిద్ర అవసరం.

58
ఒత్తిడి:

ఒత్తిడి కారణంగా కార్టిసాల్ వంటి హార్మోన్లు పెరిగి, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటి మెదడును ప్రశాంతపరిచే సాధనాలు ఉపయోగా పడతాయి.

68
వైద్యపరమైన కారణాలు:

థైరాయిడ్, PCOS వంటి హార్మోన్ల సమస్యలు బరువు తగ్గడాన్ని ఆటంకంగా మారవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఆహారం, వ్యాయామంతో పాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది.

78
తప్పుడు అంచనాలు:

త్వరగా బరువు తగ్గాలని అనుకోవడం అసాధ్యం. వాస్తవానికి ఇది అనారోగ్యకరం. బరువు తగ్గడం అనేది కంటిన్యూ ప్రాసెస్. వారానికి 0.5 నుంచి 1 కిలో వరకు బరువు తగ్గవచ్చు. ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే మార్గమిది.

88
జాగ్రత్తలు:

వర్షాకాలంలో వేడివేడి వేపుళ్ళు ఆకట్టుకుంటాయ్, కానీ వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. అందుకు బదులుగా తేలికపాటి, తక్కువ కేలరీల సూపులు, సలాడ్స్‌ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories