Weight Loss: ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే పొట్ట వచ్చేస్తుంది. అలాంటివారు జిమ్‌కి వెళ్లకుండా, డైట్ చేయకుండా పొట్ట తగ్గించుకోవాలనుకుంటే రోజూ రాత్రి పడుకునే ఈ సూపర్ డ్రింక్స్ తాగండి. పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట.
పసుపులో ఉన్న కర్కుమిన్ అనే శక్తివంతమైన పదార్థం శరీరంలోని వాపును తగ్గించి, జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు కరుగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పసుపు పాలను తాగితే మంచి నిద్ర రావడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
తయారీ విధానం: ఒక గ్లాసు పాలను వేడి చేసి, అందులో అర టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి కలపాలి. మిరియాల పొడి, పసుపులోని గుణాలను శరీరం మెరుగుగా గ్రహించేందుకు సహాయపడుతుంది. తీపిగా కావాలనుకుంటే చిటికెడు తేనె కూడా కలపవచ్చు.
26
ఇంగువ టీ
ఇంగువలో ఉన్న ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇంగువ టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గి, నిద్ర బాగా పడుతుంది.
తయారీ విధానం: ఒక కప్పు నీటిలో ఇంగువ వేసి బాగా మరిగించాలి. తరువాత వడగట్టి, అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. అవసరమైతే ఒక చిటికెడు మిరియాల పొడిని కూడా కలిపితే ఫలితం మరింత మెరుగవుతుంది.
36
గ్రీన్ టీ :
గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయి, జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఎల్-థియానైన్ అనే అమైనో ఆమ్లం మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను కలిగిస్తుంది. దీని వల్ల నిద్ర కూడా మెరుగవుతుంది.
అయితే గ్రీన్ టీలో కొద్దిపాటి కెఫిన్ ఉండే కారణంగా, పడుకునే ముందు తాగకపోవడం మంచిది. భోజనం తరువాత ఒక గంట తర్వాత లేదా పడుకునే 2–3 గంటల ముందు తాగితే మంచిది.
తయారీ విధానం: ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి 2–3 నిమిషాలు నానబెట్టి తీసేయాలి. కావాలంటే తేనె లేక నిమ్మరసం చేర్చొచ్చు, కానీ పాలు కలపవద్దు.
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ముఖ్యంగా రాత్రి మెంతుల నీరు తాగడం వల్ల, నిద్ర సమయంలో శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.
తయారీ విధానం: ఒక టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో తాగవచ్చు. లేకపోతే, అదే నీటిని గోరువెచ్చగా చేసి వడగట్టి, రాత్రి పడుకునే ముందు కూడా తాగవచ్చు.
56
దోసకాయ, పుదీనా:
దోసకాయలో నీటి శాతం అధికంగా ఉండటంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అదే సమయంలో ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో శరీర బరువు నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ రెండు పదార్థాల మిశ్రమం రాత్రిపూట తాగితే.. శరీరాన్ని ఉత్తేజపరిచి, కొవ్వు కరిగే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
తయారీ విధానం: ఒక కప్పు నీటిలో కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని తాజా పుదీనా ఆకులు వేసి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నానబెట్టాలి. పడుకునే ముందు ఈ నీటిని తాగితే శరీర శుద్ధికి సహాయపడుతుంది.
66
కొబ్బరి నీరు, దాల్చిన చెక్క :
కొబ్బరి నీరులో తక్కువ కేలరీలతో కూడిన సహజ ఎలక్ట్రోలైట్ ఉంటాయి. ఇది శరీరాన్ని తేలికగా హైడ్రేట్ చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి, కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా నిరోధిస్తుంది. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగై, శరీర శుద్ధి ప్రక్రియ ఉత్సాహంగా సాగుతుంది.
తయారీ విధానం: ఒక గ్లాసు కొబ్బరి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి బాగా మిక్స్ చేసి, పడుకునే ముందు తాగాలి.