వీధి కుక్కలు కరిచినప్పుడు, గోళ్ళతో గీరినపుడు, లేదా మలం, మూత్రం, పరాన్నజీవుల ద్వారా ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశముంది. వాటిలో రేబిస్ అత్యంత ప్రమాదకారి. ఈ వైరస్ కుక్కల లాలాజలంలో ఉంటుంది. కుక్క కరిచినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధి సమయంలో జ్వరం, తలనొప్పి, వణుకు, నీటికి భయం, మతిస్థిమితం కోల్పోవడం, పక్షవాతం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు.
- ఈ వ్యాధి ఒకసారి తీవ్రంగా మారితే చికిత్స లేదు. అందుకే, వీధి కుక్కలు కరిచిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించాలి. చిన్నారులను వీధి కుక్కల దగ్గరకు పోనీయకుండా చూసుకోవాలి.