ఈ ఒక్క అలవాటు మానుకుంటే మీకు గుండె జబ్బులే రావు

Published : Oct 02, 2025, 10:55 AM IST

ఈ రోజుల్లో చాలా చిన్నవయుసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. కనుక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కొన్ని అలవాట్లను పాటించాలి. అలాగే ఒక అలవాటును వదులుకుంటే మీకు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 

PREV
17
గుండె జబ్బులు రావొద్దంటే ?

ఈ రోజుల్లో పెద్దవారికే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఈ గుండె జబ్బులు ప్రాణాంతకం. అందుకే ఈ జబ్బులు రాకుండా ఉండటానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అయితే చాలా మంది గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే సరిపోతుందని అనుకుంటారు. 

కేవలం హెల్తీ ఫుడ్ ను తిన్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉండదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. శారీరక శ్రమ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ ఆయుశ్శును పెంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ సేపు కూర్చోకూడదు. 

27
ఎక్కువ సేపు కూర్చొని ఉంటే?

ఎక్కువసేపు కూర్చొని ఉండేవారిలో గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అదే వ్యాయామం వారిలో గుండె రక్తాన్ని బాగా పనిచేస్తుంది. వీరి గుండె బలంగా కూడా ఉంటుంది. రోజంతా చురుగ్గా లేకపోవడం, ఎక్కువ కదలకపోవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. 

37
ఎక్కువ సేపు కూర్చొని ఉంటే?

చాలా మంది ఎక్కువ సేపు కూర్చొనే ఉంటారు. కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఈ అలవాటు గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చునే వారికే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు వీరికి మరణ ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. 

47
గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మీరు రోజూ ఎక్కువ సేపు కూర్చోకుండా వ్యాయామం చేయాలి. ఇది గుండెను హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం వల్ల గుంండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గుండె కండరాలు బలంగా అవుతాయి. ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే గుండెకు బలం పెరిగే మీ ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

57
వారానికి ఎన్ని సార్లు వ్యాయామం చేయాలి?

ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి నాలుడైతు సార్లు తీవ్రమైన వ్యాయామం చేయాలి. దీనివల్ల మీ గుండె 20 ఏండ్ల యువకుడి గుండెలా పనిచేస్తుంది. అయితే వ్యాయామం చేయని వారిలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. వ్యాయామం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని తేలింది. 

67
ఎలాంటి వ్యాయామం చేయాలి?

గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి మీరు తీవ్రమైన వ్యాయామాలను మొదలుపెట్టడానికి ముందు సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్ వంటివి చేయండి. ఆ తర్వాత కఠినమైన వ్యాయామాలను చేయండి. రోజుకు కనీసం అర్థగంట పాటైనా వ్యాయామం చేయండి. లేదంటే వారానికి ఒకటి రెండు సార్లైనా హై ఇంటెన్సిటీ వ్యాయామాలను చేయండి. 

77
మెట్లు ఎక్కడం

మెట్లు ఎక్కడం, దిగడం వంటివి కూడా చాలా మంచివి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.కానీ ఎక్కువ సేపు కూర్చునే అలవాటును మాత్రం మానుకోవాలి. మీరు కూర్చొని వర్క్ చేస్తున్నట్టైతే ప్రతి అర్థగంట లేదా గంటకు మధ్యలో లేచి 5 నిమిషాలు ఫాస్ట్ గా నడవాలి. ఇది మీ గుండెను బలంగా ఉంచుతుంది. ఈ ఒక్క అలవాటున్నా మీకు గుండె జబ్బులు రావని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories