కాఫీ మిషన్ చాలా ప్రమాదకరం
తక్షణ శక్తికి, మెదడు చురుగ్గా పని చేయడానికి మనం కాఫీలు తాగుతుంటాం. ఆఫీసులో అయితే బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ అని బోలెడు రకాలుంటాయి. కానీ ఇంట్లోని కాఫీ, ఆఫీసులోని ఆర్టిఫిషియల్ కాఫీకి రుచిలోనే కాదు.. అది చూపే ప్రభావంలోనూ బోలెడు తేడా ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఇలా నిత్యం ఆఫీసులో కాఫీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. మిషన్ కాఫీ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో, లేదో వివరంగా తెలుసుకుందాం.
గుండెపై ప్రభావం
ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తయారుచేసే కాఫీతో పోలిస్తే ఆఫీసులో ఉండే మిషన్ కాఫీలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉన్నాయని తేలింది. అందుకే మిషన్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండె ఆరోగ్యంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
తాజా అధ్యయనం
ఈ విషయం గురించి ఒక కంపెనీకి చెందిన కొంతమంది పరిశోధకులు 14 ఆఫీసుల్లో మిషన్ కాఫీ నమూనాలను విశ్లేషించారు. ఇంటి కాఫీతో పోల్చి చూసినప్పుడు ఆఫీసు మిషన్ కాఫీలో కెఫెస్టాల్, కాహ్వోల్ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది శరీరంలో కొవ్వు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అంశమని పరిశోధకులు తేల్చారు. మీరు రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కాఫీలు తాగితే మీ శరీరంలో తెలియకుండానే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.
ఎసిడిటీ సమస్య
ఆఫీసు మిషన్ కాఫీ మిమ్మల్ని చురుకుగా, అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. కానీ మీరు దీన్ని ఎక్కువగా తాగితే ఆందోళన, నరాల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మిషన్ కాఫీలో చక్కెర, సిరప్ కలుపుతారు. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కాఫీ తాగడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వస్తుంది.