Summer tips: ఎండలో నడిచి వచ్చారా? ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి!

రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. అలా అని ఇంట్లోనే కూర్చుంటే పనులు కావు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల వల్ల కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎండలో నడిచిన తర్వాత లేదా తిరిగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

Summer Walk Recovery Tips for Quick Refreshment in telugu KVG

ఎండలో నడిచి వచ్చాక ఒంట్లో వేడి పెరిగి.. ఆకలి, చెమటలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఒంట్లో వేడి తగ్గించి వెంటనే హుషారుగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి! చాలా బాగా పనిచేస్తాయి.

వెంటనే నీళ్లు తాగండి

ఎండలో నడిచి వచ్చాక వెంటనే చల్లటి నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్ కలిపిన డ్రింక్ తాగండి. మరీ చల్లటి డ్రింక్ కూడా తాగకూడదు. కొద్దిగా చల్లగా ఉండేలా చూసుకోండి.

Summer Walk Recovery Tips for Quick Refreshment in telugu KVG
నెమ్మదిగా చల్లబడండి

ఎండలో తిరిగి వచ్చాక వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లకండి. నీడలో 5 నుంచి 10 నిమిషాలు హాయిగా కూర్చోండి. ఒంట్లో వేడి నెమ్మదిగా తగ్గే వరకు అలానే కూర్చోండి.


మెత్తటి క్లాత్ తో

ఎండలో తిరిగాక చెమట రావడం సహజం. మెత్తటి గుడ్డతో చెమట తుడుచుకోండి. తడి క్లాత్ తో ముఖం, మెడ, చేతులు వంటి భాగాలు తుడిస్తే కాస్త చల్లబడుతాయి. హాయిగా అనిపిస్తుంది.

డ్రెస్ చేంజ్ చేసుకోండి

ఎండలో తిరిగి వస్తే వెంటే డ్రెస్ చేంజ్ చేసుకోండి. చెమటతో తడిసిన బట్టలతో చర్మ సమస్యలు రావచ్చు. అందుకే నడిచి రాగానే బట్టలు మార్చుకోవడం మంచిది.

తేలికపాటి స్నాక్స్

సులభంగా జీర్ణమయ్యే స్నాక్స్ తీసుకోండి. పుచ్చకాయ, దోసకాయ లేదా అరటిపండు వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తినండి. ఒంట్లో హుషారునిస్తాయి.

చల్లటి నీటితో స్నానం

ఎండలో తిరిగొచ్చాక ఒకవేళ ఒళ్లంతా బాగా మండిపోతుంటే ఒంట్లో వేడి తగ్గిన తర్వాత కొద్దిసేపటికి చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. ఎండవేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

కలబంద జెల్

కలబంద లేదా చల్లదనాన్ని ఇచ్చే జెల్ వాడండి. ఎక్కువ వేడి వల్ల చర్మం మండే అవకాశం ఉంది. దీనికోసం ముఖం, చేతులు, మెడ భాగాల్లో అలోవెరా జెల్ రాయవచ్చు.

Latest Videos

vuukle one pixel image
click me!