పైన పేర్కొన్న స్ట్రోక్ లక్షణాలేవైనా కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్రారంభ 3 గంటలలోపు చికిత్స అందితే మెదడు దెబ్బతినడం తగ్గి, కోలుకునే అవకాశం పెరుగుతుంది. స్ట్రోక్ లక్షణాలు మొదలైన తరువాత మొదటి 3 నుండి 4 గంటల వ్యవధిని "గోల్డెన్ అవర్" లేదా "గోల్డెన్ పీరియడ్" అని పిలుస్తారు.
ఈ సమయంలో వైద్య చికిత్స అందితే:
- మస్తిష్కానికి తీవ్ర నష్టం జరగదు.
- వ్యాధి తీవ్రత తగ్గుతుంది,
- రికవరీ త్వరగా జరుగుతుంది,
- పేషెంట్ తిరిగి సాధారణ జీవితం సాగించే అవకాశాలు పెరుగుతాయి.
ఏమి చేయాలి?
ముఖం వంగిపోవడం, చేయి లేదా కాలు బలహీనంగా మారడం, మాట్లాడలేకపోవడం, ఆకస్మాత్తుగా తిమ్మిరి ఇవి కనిపించిన వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి లేదా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లండి.
- కొన్ని సందర్భాల్లో లక్షణాలు కొద్దిసేపటి తరువాత మాయమవుతాయి. ఇది తాత్కాలిక ఇస్కీమిక్ దాడి (TIA) కావచ్చు. అయితే ఇది ఒక హెచ్చరిక సంకేతం. భవిష్యత్తులో తీవ్రమైన స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల లక్షణాలు తగ్గినా వైద్య పరీక్ష తప్పనిసరి.