Kidney Failure: కిడ్నీల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యంపై పడుతుంది.అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ కిడ్నీ వైఫల్యం ఎందుకు వస్తుంది? కిడ్నీ వైఫల్యం లక్షణాలు ఏమిటి? నివారణ చర్యలు ఏమిటి? వివరంగా తెలుసుకుందాం.
శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే డయాబెటిస్, బీపీ, జీవనశైలి లోపాలు వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. జన్యుపరమైన కారణాలను తప్ప బహుశా చాలా సమస్యలు నివారించగలిగేవే. కాబట్టి, కిడ్నీలను రక్షించుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి.
26
రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి?
కిడ్నీలను రక్షించుకోవడానికి మనం ముందుగా చేయాల్సింది మన శరీరానికి ఏది ఆరోగ్యకరమో ముందే తెలుసుకోవాలి. కిడ్నీ ఆరోగ్యంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే ఉప్పు వినియోగాన్ని నియంత్రించాలి, రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తీసుకోరాదు, అప్పడాలు, ఊరగాయలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బిస్కెట్లు వంటి ఆహారాల్లో అధిక ఉప్పు ఉండడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది, కాబట్టి ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా కిడ్నీ సమస్యల్ని నివారించవచ్చు.
36
ఎంత నీరు తాగాలి?
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తగినంత నీరు త్రాగాలి, అయితే కిడ్నీలో రాళ్లు లేదా కణితులు ఉన్నవారికి వైద్యుల సలహా మేరకే నీటి మోతాదును పెంచాలి. సమస్య వచ్చిన తర్వాత అధికంగా నీరు తాగడం మంచిదికాదు, రోజులో విరామాల మధ్యగా, ఒకేసారి కాకుండా నీరు తాగాలి. సాధారణంగా రోజూ 3 లీటర్లు, వేసవిలో 4 లీటర్ల వరకు తాగాలి.
కిడ్నీ సమస్య వస్తే.. తొలినాళ్లలో స్పష్టమైన లక్షణాలు చూపించవు, కానీ, మూత్రంలో ప్రోటీన్ లీక్ అయితే నురగగా కనిపించవచ్చు, రాళ్లు ఉంటే వెన్నునొప్పి, కాళ్ల వాపు కనిపించవచ్చు. అనవసర మందులు, ముఖ్యంగా నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం కిడ్నీకి ముప్పు వాటిల్లుతుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని క్రియాటినిన్ స్థాయిల ద్వారా అంచనా వేస్తారు. స్థాయి అధికంగా ఉంటే.. మూత్రపిండాల వైఫల్యం చివరి దశకు చేరుకున్నట్టు. కిడ్నీ పూర్తిగా పాడైపోతే.. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది.
56
ఇతర పరీక్షలు తప్పని సరి
కిడ్నీలు పాడవకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీల ఆకృతి, పరిమాణం, రాళ్లు లేదా కణితులు అల్ట్రా సౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి కిడ్నీలు త్వరగా దెబ్బతిన్న అవకాశముంది. ఈ కారణంగా షుగర్ పరీక్షతో కిడ్నీల పరీక్ష తరచూ చేయించాలి. బిపి, కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణ స్థాయి, కుటుంబ చరిత్ర వంటి ఐదు అంశాలను గుర్తుంచుకోవాలి. వీటిని రెగ్యులర్‌గా పరిశీలించడం వల్ల కిడ్నీ సమస్యలను ముందుగా గుర్తించి, సమయానికి చికిత్స తీసుకోవచ్చు.
66
సమతుల్య ఆహారం
డయాబెటిస్, బిపిని అదుపులో ఉండటానికి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. రక్తనాళాలకు మేలు చేసే పొటాషియం ఆహారంలో ఉండాలి. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో పొటాషియం పరిమితంగా ఉండాలి. ఉప్పు తీసుకునే పరిమాణాన్ని గరిష్ఠంగా తగ్గించాలి. అధిక ప్రోటీన్, అధిక కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలను తగ్గించడం మంచిది. మూత్రాన్ని ఎప్పుడూ ఆపకుండా.. తగినంత నీరు తాగి సకాలంలో విసర్జించాలి. ఎండలో ఎక్కువ పని చేసే వారు తరచూ నీరు తాగుతూ ఉండటం ద్వారా కిడ్నీ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.