Matcha Tea: జపానీస్ హెల్త్ సీక్రెట్ మాచా గ్రీన్ టీ.. ఈటీతో ఎన్ని లాభాలో తెలుసా?

Published : Jul 02, 2025, 01:59 PM IST

Matcha Tea Health Benefits:  మాచా టీ ఒక ప్రత్యేకమైన, సాంప్రదాయక జపనీస్ గ్రీన్ టీ.  ఇది సాధారణ గ్రీన్ టీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ టీని ఆకులను పొడిగా చేసి, వేడి నీటిలో కలిపి తయారు చేస్తారు. మాచా గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంట. 

PREV
16
సంప్రదాయంలోనే ఆరోగ్యం.. జపాన్ మాచా టీ విశేషాలు!

ఇప్పటికీ జపాన్‌లో అనేక సంప్రదాయాలను పాటిస్తుంది. వాటిలో ఒకటి మాచా గ్రీన్ టీ, ఈ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాచా టీని  నీడలో పెరిగే ప్రత్యేక మొక్కల ఆకులతో తయారు చేస్తారు. ఇతర టీల మాదిరిగా కాకుండా ఈ మాచా టీ వల్ల చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

26
చర్మ ఆరోగ్యం

మాచా టీలో కేటెచిన్లు, విటమిన్ A, B-కాంప్లెక్స్, C, K చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ B2 చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది. ఇవి చర్మ కణాలను రక్షించి, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. నిత్యం ఒక్క కప్పు మాచా టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తేజంగా కనిపించేందుకు సహాయపడుతుంది.

36
గుండె, కాలేయానికి మంచిది!

మాచా టీలో ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలేయ ఎంజైమ్‌లను సమతుల్యం చేస్తాయి.ఇవి కాలేయ కణాలను హాని నుంచి రక్షించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే, ఇవే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. రోజూ ఒక కప్పు మాచా టీ తాగడం ద్వారా  మీ కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

46
కొలెస్ట్రాల్ తగ్గుతుంది

మాచా టీ వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఉదయాన్నే ఈ టీ తీసుకోవడం వల్ల మెదడు ఉల్లాసంగా ఉండి చదువులో, ఉద్యోగంలో దృష్టి కేంద్రీకరించడానికి మంచి సహాయం చేస్తుంది. ఇది శక్తి, ఆరోగ్యం, ఏకాగ్రత ఇచ్చే ప్రకృతి వరం.

56
బరువు తగ్గడం

మాచా టీలో తక్కువ కేలరీలు ఉండటం, మెటబాలిజాన్ని పెంచే గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కడుపు నిండినట్టు ఆకలిని నియంత్రిస్తుంది. రోజూ పాల టీకి బదులు మాచా టీ తాగుతూ, సరైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామాన్ని పాటిస్తే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

66
సాధారణ టీ vs మాచా టీ;

మనం తాగే సాధారణ టీతో పోల్చితే మాచా టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ తొలగించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరం.  రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. మాచా టీని రోజువారీ డైట్ లో భాగం చేసుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories