Kidney: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు డ్యామేజ్ అయినట్టే..!
Telugu
మూత్ర విసర్జనలో మార్పులు
రాత్రిళ్ళు తరచుగా మూత్ర విసర్జన, మూత్రం తక్కువగా రావడం, మూత్రం ముదురు రంగులో ఉండటం వంటివి కిడ్నీ సమస్య లక్షణాలు.
Telugu
చేతులు, కాళ్ళ వాపు
కిడ్నీ పనితీరు మందగించడం వల్ల కాళ్ళు, చేతులు, కండ్ల కింద, ముఖం వాపు రావచ్చు.
Telugu
చర్మం పొడిబారడం, దురద
కిడ్నీలు దెబ్బతినడం వల్ల వ్యర్థాలు, లవణాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారడం, దురద వంటివి రావచ్చు.
Telugu
అలసట, నీరసం
అలసట, నీరసం కిడ్నీ సమస్యల వల్ల కూడా రావచ్చు. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ఈ పని సరిగ్గా జరగకపోతే, శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి.
Telugu
శ్వాస ఆడకపోవడం
కొన్ని సందర్భాల్లో శ్వాస ఆడకపోవడం కిడ్నీ సమస్యలకు సంబంధించిన లక్షణం కావచ్చు.
Telugu
నడుం నొప్పి
నడుం, కడుపు పక్క భాగాల్లో నొప్పి కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు.
Telugu
గమనిక:
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.