అధిక బరువు, ఆరోగ్యంపై శ్రద్ధ, ఇతర కారణాల వల్ల చాలామంది ఫాస్టింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‍ని ఫాలో అవుతున్నారు. కానీ 16 గంటలు ఏం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? మంతెన ఏం చెప్పారో చూద్దాం.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత కాలంలో చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండే ఈ పద్ధతి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అసలు ఈ విధానం ఆరోగ్యానికి మంచిదా? లేక ప్రమాదమా? దీనిపై ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు ఏం చెప్పారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
16 గంటలు ఫుడ్ తినకపోతే..
మంతెన ప్రకారం.. 16 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటే శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గి, శరీరం.. నిల్వ ఉన్న కొవ్వును ఎనర్జీగా ఉపయోగించడం మొదలు పెడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరంలో ఆటోఫాజీ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇందులో పాత, దెబ్బతిన్న కణాలు తొలగిపోయి, కొత్త కణాలు ఏర్పడతాయి. దీనివల్ల శరీర శుద్ధి జరుగుతుంది. మనం తినే ఆహారానికి సరైన విరామం ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఇది శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మంతెన చెబుతున్నారు.
34
ఈ సమస్యలు వచ్చే అవకాశం
అయితే 16 గంటలు ఆహారం తీసుకోకపోవడం అందరికీ సెట్ కాకపోవచ్చు. మొదటిసారి ప్రయత్నించే వారికి కాస్త తలనొప్పి, అలసట, బలహీనంగా అనిపించవచ్చు. శరీరం అలవాటు పడే వరకు ఈ లక్షణాలు కనిపించడం సహజం. మంతెన ప్రకారం, ఉపవాసం చేసే సమయంలో నీళ్లు, జ్యూసులు, లేదా సహజ పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత తేలికపాటి, సహజ ఆహారం తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినడం జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవచ్చు. అయితే ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే ఈ విధానాన్ని అనుసరించాలి. మంతెన సూచన ప్రకారం.. 16 గంటల ఫాస్టింగ్ సరైన పద్ధతిలో, శరీరానికి అనుగుణంగా చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.