Healthy Lungs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా? ఈ నేచురల్ రెమెడీస్ మీకోసమే!

Published : Jun 02, 2025, 12:51 PM IST

Healthy Lungs: ఇటీవలి కాలంలో చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తున్నాయి. వాయు కాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులు ఆర్యోగంగా ఉండాలంటే కొన్ని సాధారణ చర్యలను అనుసరించాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
16
ఊపిరితిత్తుల సంరక్షణ

ఇటీవలి కాలంలో చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం పెరగడం, పొగతాగడం, జీవన విధానంలో మార్పులు కారణంగా శ్వాసకోశాలకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  ప్రతిరోజూ ఉదయాన్నే అల్లం-నిమ్మరసం కలిపిన వేడి నీటిని తాగుతున్నారు. దీని వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలున్నాయి. 

26
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జీర్ణ సమస్యలను తగ్గించడానికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లం ఊపిరితిత్తులలో పేరుకుపోయిన వాయువును తొలగిస్తుంది. అలాగే.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

36
బరువు నియంత్రణ

అల్లం, నిమ్మరసం కలిపిన పానీయం ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, అనవసరమైన కొవ్వును తగ్గిస్తుంది. 

46
రోగనిరోధక శక్తి

అల్లం, నిమ్మరసం రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే.. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వైరస్ లు, జలుబు వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. 

56
కాంతివంతమైన చర్మం

అల్లం, నిమ్మరసం జ్యూస్ శరీరంలోని హానికరమైన వ్యర్థాలను బయటకు పంపుతుంది. అల్లం, నిమ్మరసం కలిపిన నీరు తాగేతే.. శరీరం హైడ్రేటెడ్ గా మారుతుంది. అలాగే.. చర్మంపై మొటిమలను తగ్గిస్తుంది. నిమ్మరసం చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా,  కాంతివంతంగా మార్చుతుంది. 

66
ఊపిరితిత్తుల సంరక్షణ

ధూమపానం, వాయు కాలుష్యం,  ఇతర హానికరమైన పరిస్థితుల నుండి ఊపిరితిత్తులను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories