ప్రస్తుతం చాలామంది బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా.. కొద్ది రోజుల్లోనే బీపీ, షుగర్ నార్మల్ అవుతుందట. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా..
ప్రస్తుతం షుగర్ వ్యాధి సాధారణం అయిపోయింది. అయితే షుగర్ ఒక్క రోజులో వచ్చేది కాదు. చాలా కాలం పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. అలాగే హై బీపీ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతుంటారు.
మీరు కూడా ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్, బీపీ అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
27
ఉసిరికాయ:
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. బీపీ, షుగర్ తగ్గించుకోవడానికి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ తినవచ్చు. లేదా జ్యూస్‌లా తాగవచ్చు. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉసిరికాయను ఖాళీ కడుపుతో తీసుకుంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
37
మెంతులు:
మెంతులు.. రక్తంలో చక్కెర స్థాయిని, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెంతుల్లో కరిగే, కరగని ఫైబర్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నానబెట్టిన మెంతులను తింటే బీపి, షుగర్ తగ్గుతుంది.
అవిసె గింజల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీ, షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతాయి. రోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో అవిసె గింజల పొడి కలిపి తాగవచ్చు. లేదా స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు.
57
దాల్చిన చెక్క, మిరియాలు:
దాల్చిన చెక్క రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా అడ్డుకుంటుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మిరియాలు శరీరంలో పోషకాల శోషణకు సహాయపడతాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి కలిపి ఖాళీ కడుపుతో తాగాలి.
67
పసుపు, నిమ్మరసం:
పసుపు.. రక్తంలో షుగర్ లెవెల్స్, బీపీ రెండింటినీ అదుపులో ఉంచుతుంది. పసుపుతో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒక గ్లాసు పసుపు నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. రోజూ ఖాళీ కడుపుతో తాగితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.
77
దానిమ్మ రసం:
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని అదుపులో ఉంచుతాయి. రోజూ ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగితే బీపీ, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
గమనిక
ఆహారంలో మార్పులు చేసుకునే ముందు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.