ఆరోగ్యంగా ఉండడానికి ప్రశాంతమైన నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ చాలామంది రాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అయితే పాలలో కొన్ని సహజమైన పదార్థాలు కలపడం ద్వారా ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. ఆ పదార్థాలెంటో.. మంచి నిద్ర ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
అశ్వగంధ ఒక ఆయుర్వేద మూలిక. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరచి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అశ్వగంధలోని ట్రైఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం నిద్రను ప్రేరేపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలోని కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది నిద్రలేమికి ఒక ప్రధాన కారణం.
25
జాజికాయ పొడి
జాజికాయ ఒక అద్భుతమైన ఔషధ గుణం కలిగిన సుగంధ ద్రవ్యం. ఇది సహజమైన మత్తుమందుగా పనిచేస్తుంది. తక్కువ మోతాదులో జాజికాయ పొడిని పాలలో కలిపి తాగడం వల్ల మనశ్శాంతి లభించి నిద్ర బాగా పడుతుంది. జాజికాయలో మిరిస్టిసిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి నిద్రను ప్రోత్సహిస్తుంది.
35
ఎలా వాడాలి?
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో (సుమారు 200 మి.లీ) అర టీస్పూన్ (సుమారు 2-3 గ్రాములు) అశ్వగంధ పొడిని కలపండి. పావు టీస్పూన్ కంటే తక్కువ (సుమారు 1 గ్రాము) జాజికాయ పొడిని కలపండి. జాజికాయను ఎక్కువగా వాడటం వల్ల కొన్నిసార్లు మైకం లేదా తలనొప్పి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రెండు పొడులను బాగా కలిపి పడుకునే ముందు తాగచ్చు.
- ఈ మిశ్రమాన్ని పడుకునే 30-60 నిమిషాల ముందు తాగడం మంచిది.
- పాలకు బదులు బాదం పాలు లేదా కొబ్బరి పాలను కూడా వాడవచ్చు.
- చక్కెర కలపాలి అనుకునేవారు కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
- కొన్ని రోజులు ఈ పద్ధతిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
- అధికంగా జాజికాయ వాడటం మంచిది కాదు.
-ఈ సులభమైన, సహజమైన ఇంటి చిట్కా నిద్రలేమి సమస్యకు మంచి పరిష్కారం కావచ్చు. ప్రయత్నించి మంచి నిద్రను పొందచ్చు.
55
నిద్రలేమికి కొన్ని పరిష్కారాలు..
- ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం అనే అలవాటు శరీరంలోని సహజ నిద్ర చక్రాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది.
- టెలివిజన్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పడుకునే ముందు వాడటం మానుకోవాలి.
- కాఫీ, మద్యం వంటి పానీయాలను పడుకునే కొన్ని గంటల ముందు తాగడం మానుకోవాలి.
- హెవీ ఫుడ్ ని పడుకునే ముందు తినడం మానుకుని తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది.