Backward Walking: నడక ఆరోగ్యానికి చాాలా మంచిది. వాకింగ్ చేసేటప్పుడు అందరూ ముందుకే నడుస్తారు. అయితే.. ముందుకు మాత్రమే కాదు వెనక్కి కూడా ఐదు నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. ఇంతకీ లాభాలెంటో ఓ లూక్కేద్దామా..
మనం ప్రతిరోజూ ముందుకు నడుస్తాం. వ్యాయామం చేసేటప్పుడు కూడా మన శరీరాలు ముందుకు కదిలే విధంగానే చేస్తాం. కానీ వెనక్కి నడక అనేది శరీరానికి అదనపు ప్రయోజనాలను చేకూరుతాయంట. కనీసం 10 నిమిషాల పాటు వెనక్కి నడవండి.
27
వెనక నడకతో లాభాలు
మీరు సాధారణంగా నడిచేటప్పుడు కండరాలు, కాలి, తొడ ఎముకలపై ప్రభావం పడుతుంది. వెనక్కి నడిస్తే.. పనిచేయని కండరాలు కూడా కదలికకు లోనవుతాయి. అలాగే శరీరానికి సమతుల్యత, సమన్వయం, కీళ్ల బలం, మోకాళ్ళు, నడుము చుట్టూ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.
37
మోకాలి నొప్పి
మీకు మోకాలి నొప్పి లేదా కీళ్ల నొప్పులు ఉంటే వెనక్కి నడక ఉపశమనం కలిగిస్తుంది. వెనక్కి నడక కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. మోకాలి గాయాలు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కీళ్ల సమస్యలకు చికిత్స తీసుకునేవారు కూడా వెనక్కి నడవచ్చు.
సాధారణంగా ముందుకు నడవటం కంటే వెనక్కి నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వెనక్కి నడిచేటప్పుడు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీని వల్ల ఆక్సిజన్ వినియోగం పెరిగి హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది.
57
మెదడు పనితీరు
శరీరానికి స్ట్రెచ్ అయ్యే గుణం ఉంటుంది. ముందుకు నడవడం వ్యతిరేక దిశలో నడవడం వల్ల మెదడు పనితీరు వేగవంతమవుతుంది. దీని వల్ల ఆలోచనా శక్తి కూడా మెరుగుపడుతుంది.
67
ఎందుకు మంచిది?
సాధారణంగా నడిచేటప్పుడు మడమ ముందుగా నేలను తాకుతుంది. ఆ తర్వాత వేళ్లను ఉంచి నడుస్తాం. కానీ వెనక్కి నడిచేటప్పుడు ఇది వ్యతిరేకంగా జరుగుతుంది. ముందుగా వేళ్లు ఆ తర్వాత మడమ నేలను తాకుతుంది. సాధారణం కంటే దీనికి ఎక్కువ శ్రద్ధ, శ్రమ అవసరం. దీని వల్ల శరీరానికి, మెదడుకు సమన్వయం లభిస్తుంది. సాధారణ నడక కంటే 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
77
ఇతర ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం, కండరాల బలం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుదల, శారీరక సమతుల్యత వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.