Diabetes: రక్తంలో షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్..

Published : Jul 20, 2025, 01:25 PM IST

Diabetes: డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాల గురించి తెలుసుకుందాం.

PREV
18
షుగర్ ను అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి.  ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రధానంగా రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. సహజంగా బ్లడ్ షుగర్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.

28
మెంతులు (Fenugreek):

మెంతులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ మెంతులు తినడం మధుమేహ నియంత్రణకు సహకరిస్తుంది.

38
కాకరకాయ

కాకరకాయలో ఫైబర్, యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేస్తుంది. ఫలితంగా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి.  

48
దాల్చిన చెక్క (Cinnamon)

 దాల్చిన చెక్క.. యాంటీఆక్సిడెంట్లతో పాటు ఇన్సులిన్‌ను ప్రభావాన్ని చూపించే సహజ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తుంది.

58
ఉసిరికాయ (Indian Gooseberry)

ఉసిరికాయలో విటమిన్ C సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర శాతం నియంత్రణకు సహాయపడుతుంది. అంతేగాక, ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంతో పాటు బీటా సెల్స్  పనితీరును మెరుగుపరుస్తాయి. 

68
పెసరపప్పు

పెసరపప్పు మొలకలు డయాబెటిస్ ఉన్నవారికి మంచివి. ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

78
బెండకాయ

బెండకాయ (Okra) రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే ఉత్తమ ఆహారాలలో ఒకటి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. బెండకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ.

88
ఓట్స్
ఫైబర్ ఉన్న ఓట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా ఉంటుంది.
Read more Photos on
click me!

Recommended Stories