Covid 19: మీలో కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? దీనికి అప్ప‌టి క‌రోనానే కార‌ణం

Published : Jul 19, 2025, 07:40 AM IST

క‌రోనా నాటి రోజులు గుర్తొస్తేనే గుండె గుబేల్ మంటుంది. కంటికి క‌నిపించని మాయ‌దారి వైర‌స్ వేలాది మందిని బ‌లి తీసుకుంది. కాగా ఆ స‌మ‌యంలో క‌రోనా బారినప‌డ్డ‌వారికి ఆ వైర‌స్ దుష్ప్ర‌భావాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. 

PREV
15
కోవిడ్‌ వల్ల నరాలపై ప్రభావం

2020లో మొదటి వేవ్ సమయంలో నిమ్హాన్స్ (NIMHANS) 3,200 మంది నర సంబంధిత రోగుల వివరాలను పరిశీలించింది. వీరిలో 120 మందికి (3.75%) కోవిడ్‌తో పాటు నరాల సమస్యలు వచ్చాయి. వీరిలో అత్యధికంగా కనిపించిన లక్షణాలు ఇవే..

స్పృహ కోల్పోవడం (47%)

విరేచనాలు, ఫిట్స్‌ (21%)

వాసన తెలియకపోవడం (14.2%)

ఇందులో చాలా మంది (49%)కు కోవిడ్‌కు ముందే జ్వరం వచ్చింది. దీనివల్ల వైరస్‌ నేరుగా మెదడుపై ప్రభావం చూపించవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది.

25
వ్యాక్సిన్ తర్వాత న్యూరో సంబంధిత రుగ్మ‌త‌లు

2021 మే నుంచి డిసెంబరు మధ్యకాలంలో నిమ్హాన్స్ 116 మందిని అధ్యయనం చేసింది. వీరంతా కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల్లో నర సంబంధిత సమస్యలతో వచ్చారు. ఇందులో 29 మందికి "పోస్ట్ వాక్సిన్ డిమైలినేషన్" అనే నరాల దెబ్బతినే వ్యాధి నిర్ధారణ అయ్యింది. వీరిలో 27 మందికి కోవిషీల్డ్ వాక్సిన్ తర్వాత ఈ సమస్యలు వచ్చాయి

35
ప్రధాన లక్షణాలు

మైలోపతి (37.9%) – మెదడు నుంచి స్పైన్ వరకు నరాల దెబ్బతినడం

ఆప్టిక్ న్యూరైటిస్ (20.7%) – కళ్ళకు సంబంధించిన నరాలపై ప్రభావం

ఏసీడ్‌ఇ (ADEM) (17.2%) – వైరల్‌ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే మెదడు సమస్య

తీవ్రత తక్కువే

న్యూమునాలజీ స్పెషలిస్టులైన నిమ్హాన్స్‌ డాక్టర్లు ఈ కేసులు ఎక్కువగా గుర్తించారు. అయితే సాధారణ ప్రజల్లో ఇది చాలా అరుదుగా వస్తుందని వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నరాల‌ సంబంధిత సమస్యలు వచ్చినవారిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇంకొంతమందిలో వేరే బ్రాండ్ వాక్సిన్‌ లేదా రెండో డోస్ తీసుకున్నా పెద్దగా సమస్యలు రాలేదు.

45
పోస్ట్ కోవిడ్‌లోనూ నరాల‌ సంబంధిత మార్పులు

కేవలం కోవిడ్ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, కోలుకున్న తర్వాత కూడా చాలామందిలో నర సంబంధిత సమస్యలు కనబడుతున్నాయని నిమ్హాన్స్ పేర్కొంది. దీని వల్ల కోవిడ్‌ నుంచి కోలుకున్నవారిని కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

55
సూచనలు, జాగ్రత్తలు

మెదడు ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిద్ర సరిగా పొందాలి, శారీరక వ్యాయామం చేయాలి, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. కోవిడ్‌ తర్వాత వచ్చే అనేక అవయవాల ప్రభావాన్ని తెలుసుకోవడానికి పెద్దస్థాయిలో అధ్యయనాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories