Liver Health: కాలేయం ఆరోగ్యం దెబ్బతినడానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. కొన్ని ఆహారాలు కూడా లివర్ హెల్త్ ను పాడుచేస్తాయి. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తప్పనిసరి. అనారోగ్యకర, తప్పుడు ఆహారపు అలవాట్లు లివర్ హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాలేయ ఆరోగ్యానికి హాని చేసే ఆహారాల గురించి తెలుసుకుందాం:
28
నూనెలో వేయించిన ఆహారాలు
నూనెలో వేయించిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వుతో లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి ఫ్యాటి లివర్‌కు దారితీయవచ్చు. అందుకే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.
38
అధిక చక్కెర ఆహారాలు, పానీయాలు
చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ వేగంగా కొవ్వుగా మారుతుంది. దీనివల్ల నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్ (NAFLD) అనే సమస్య పెరుగుతుంది. ఇలాంటి ఆహారాలను తరచూ తీసుకుంటే, లివర్‌లో కొవ్వు గడ్డకట్టినట్లుగా చేరి దీర్ఘకాలికంగా లివర్ పనితీరును మందగిస్తుంది.
అనారోగ్యకరమైన కొవ్వు కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే.. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, ప్రీఫ్యాక్డ్ ఫుడ్, ఫ్రోజన్ స్నాక్స్ తరచుగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ (NAFLD) ప్రమాదం పెరుగుతుంది. ఇవి లివర్‌లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, లివర్ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంగా ఇలా జరిగితే లివర్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి తీవ్ర సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
58
రెడ్ మీట్
రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్‌పై ఒత్తిడి పెరిగి, కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండటంతో ఫ్యాటీ లివర్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబ్టటి రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేండి.
68
కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నం, వైట్ బ్రెడ్, పాస్తా వంటివి లివర్ ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇవి లివర్‌పై ఒత్తిడి తెచ్చి ఇన్‌సులిన్ రిజిస్టెన్స్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తాయి.
78
ఉప్పు
ఉప్పు (సోడియం) అధికంగా తీసుకోవడం కాలేయానికి హానికరం, ముఖ్యంగా నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ వ్యాధి ఉన్నవారు అధిక ఉప్పు ఆహారం తీసుకునే లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాపు, ఫైబ్రోసిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారీ ఉప్పు వినియోగాన్ని తగ్గించడం మేలు.
88
గమనిక:
ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.