రూమ్ ఫ్రెష్నర్స్ వాడుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!

Published : Sep 02, 2025, 04:42 PM IST

సాధారణంగా మనం ఇంట్లో సువాసన రావడం కోసం రూమ్ ఫ్రెష్నర్స్ వాడుతుంటాం. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటినుంచి వచ్చే వాసన బాగానే ఉన్నా.. వీటివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తప్పవట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
రూమ్ ఫ్రెష్నర్స్ వాడటం వల్ల కలిగే సమస్యలు

ఇంట్లో సువాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెష్నర్స్ చాలా రకాల సమస్యలను తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. రూమ్ ఫ్రెష్నర్స్ లో ఉండే ప్రమాదకర రసాయనాలు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవి మరింత హాని చేస్తాయట. రెగ్యులర్ గా రూమ్ ఫ్రెష్నర్ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
శ్వాసకోశ సమస్యలు

నిపుణుల ప్రకారం.. రూమ్ ఫ్రెష్నర్ లోని రసాయనాల వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఆస్తమా పేషెంట్స్, పిల్లలు, గర్భిణీలు ఉన్న ఇళ్లలో రూమ్ ఫ్రెష్నర్ వాడకపోవడమే మంచిది. అంతేకాదు రూమ్ ఫ్రెష్నర్స్ వల్ల కళ్లు, గొంతు, ఊపిరితిత్తుల్లో మంట వస్తుంది. ఎక్కువ కాలం వాడితే లివర్, కిడ్నీలు కూడా దెబ్బతింటాయి.

35
హార్మోన్ల అసమతుల్యత

రూమ్ ఫ్రెష్నర్ లోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీనివల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి మనుషులకే కాదు పెంపుడు జంతువులకు కూడా హానికరం. రూమ్ ప్రెష్నర్స్ వాడినప్పుడు పెంపుడు జంతువుల్లో శ్వాస సమస్యలు, తుమ్ములు, దగ్గు, దురద వంటివి కనిపిస్తాయి.

45
గాలి నాణ్యత

రూమ్ ఫ్రెష్నర్ గాలి నాణ్యతను తగ్గిస్తుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు ఇది దుర్వాసనను కప్పిపుచ్చుతుంది. కానీ దాన్ని పోగొట్టదు. దీనివల్ల గాలి నాణ్యత మరింత దిగజారుతుంది.

55
సువాసన కోసం..

ఇంట్లో సువాసన కోసం రసాయనాలకు బదులు సహజంగా దొరికే పదార్థాలు ఉపయోగించండి. సాంబ్రాణి, ధూపం వంటివి ట్రై చేయొచ్చు. మంచి వాసన వచ్చే పూల మొక్కలు పెంచుకోవచ్చు. లేదా సహజ పదార్థాలతో ఇంట్లోనే స్ప్రేలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రావు.

Read more Photos on
click me!

Recommended Stories