మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చెబుతున్నాయి. పురుషులు బలమైన కండరాలతో, శక్తివంతంగా కనిపించినా దీర్ఘాయుష్షు విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇందుకు కారణాలేంటంటే.
పుట్టిన వెంటనే బాలికల ఆరోగ్యం, అబ్బాయిల కంటే మెరుగ్గా ఉంటుంది. నవజాత శిశువుల మరణాల రేటు బాలికలలో తక్కువ. దీనికి ప్రధాన కారణం క్రోమోజోములు. స్త్రీలకు రెండు X క్రోమోజోములు ఉండటంతో వ్యాధులకు వ్యతిరేకంగా శరీరం బలమైన రక్షణ పొందుతుంది. పురుషులకు ఒక X, ఒక Y క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల పురుషులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
25
హార్మోన్ల తేడా
పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ శరీరాన్ని బలంగా చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది గుండెకు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. స్త్రీల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉంటుంది. ఇది శరీరానికి సమతుల్యతను ఇవ్వడమే కాకుండా గుండెను కూడా రక్షిస్తుంది. అందువల్ల మహిళలు గుండె జబ్బులకు తక్కువగా గురవుతారు.
35
జీవనశైలి ప్రభావం
పురుషుల జీవనశైలి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటుంది. ధూమపానం, మద్యం, పొగాకు వాడకం పురుషుల్లో ఎక్కువ. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల రేటు కూడా వారిలో అధికం. మహిళలు అయితే ఎక్కువగా కుటుంబానికి అనుసంధానమై ఉంటారు. వారు ఆహారం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు. ఈ వ్యత్యాసం కూడా ఆయుష్షు పెరగడానికి ఒక ప్రధాన కారణం.
స్త్రీల రక్తంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయి పురుషుల కంటే ఎక్కువ. ఇది గుండెను సురక్షితంగా ఉంచుతుంది. పరిశోధనల ప్రకారం మహిళల్లో HDL స్థాయి సగటు 60.3 mg/dL ఉండగా, పురుషుల్లో 48.5 mg/dL మాత్రమే. మంచి జీవక్రియ (Metabolism) ఉండటం వల్ల స్త్రీల శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. దాంతో మధుమేహం, ఊబకాయం ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.
55
వ్యాధుల వ్యత్యాసం
మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయం, అండాశయ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఇవి సమయానికి చికిత్సతో నియంత్రించదగ్గవే. పురుషుల్లో ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఇవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం అధికం. అదనంగా అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల పురుషుల ఆయుష్షు తగ్గుతుంది.