ఇన్‌స్టంట్ ఫుడ్, సూప్‌లలో అధిక సోడియం, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి కిడ్నీలకు హాని కలిగిస్తాయి. అధిక రక్తపోటుకు దారితీస్తాయి. ఊరగాయ, ప్యాక్ చేసిన చిరుతిళ్లలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. అదనపు సోడియంను తొలగించడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దానివల్ల కాలక్రమేణా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది.