Health: ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్ విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. బీర్ తాగితే రాళ్లు పడిపోతాయని కొందరు నమ్ముతారు. ఇంతకీ ఇది నిజమా? డాక్టర్లు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్ తాగితే అన్ని రకాల కిడ్నీ స్టోన్స్ బయటకు వస్తాయా?
చాలామందికి ఉన్న నమ్మకం ఏంటంటే బీర్ తాగితే మూత్రం ఎక్కువగా వస్తుంది, అందుకే స్టోన్ కదిలి బయటకు వస్తుంది అని. నిజం ఏంటంటే బీర్ మూత్రం పరిమాణం పెంచుతుంది కానీ స్టోన్ సురక్షితంగా బయటకు రావడానికి ఇది సరైన మార్గం కాదు. 5 మిల్లీమీటర్ల కన్నా చిన్న స్టోన్స్ కొన్ని సందర్భాల్లో సహజంగా బయటకు రావచ్చు. కానీ పెద్ద స్టోన్స్ బీర్ వల్ల బలవంతంగా కదిలితే తీవ్రమైన నొప్పి, మూత్రనాళంలో అడ్డంకి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
25
బీర్ ఒక సురక్షితమైన ఇంటి చిట్కా అనుకోవచ్చా?
చాలామంది మందులు తీసుకోవడం కన్నా బీర్ తాగితే సరిపోతుందని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. బీర్‌లో ఆక్సలేట్ ఉంటుంది. ఇదే కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఎక్కువకాలం బీర్ తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని వల్ల కొత్త స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కిడ్నీలపై ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
35
ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా బయటకు వస్తుందా?
ఇది మరో పెద్ద అపోహ. ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా ఫ్లష్ అవుతుందని చాలామంది భావిస్తారు. కానీ అకస్మాత్తుగా మూత్రం ఎక్కువగా రావడం వల్ల స్టోన్ తప్పకుండా బయటకు వస్తుంది అనుకోవడం ప్రమాదకరం. మూత్రనాళంలో స్టోన్ ఇరుక్కుంటే నొప్పి, వాంతులు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ప్రత్యేక మందులు ఉన్నాయి. అవి మూత్రనాళ కండరాలను రిలాక్స్ చేసి స్టోన్ సురక్షితంగా బయటకు రావడానికి సహాయపడతాయి.
కొంతమంది చికిత్స ఖర్చుతో కూడినదని భావించి బీర్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. వైద్య చికిత్స చాలా సురక్షితం, ప్రభావవంతం కూడా. చిన్న స్టోన్స్ మందులతో బయటకు రావచ్చు. అవసరమైతే నేటి ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా చిన్న శస్త్రచికిత్సతో స్టోన్స్‌ను సులభంగా తొలగించవచ్చు. ఇవన్నీ బీర్ కన్నా ఎంతో భద్రమైన మార్గాలు.
55
ఈ అంశంపై డాక్టర్లు ఏమంటున్నారు?
యూరాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కిడ్నీ స్టోన్ ఉన్నవారికి బీర్ తాగితే స్టోన్ కరిగిపోతుందనేది పూర్తిగా అపోహ మాత్రమే అని చెబుతున్నారు. బీర్ స్టోన్‌ను కట్ చేసి బయటకు తీసుకురాదు. అసలు ఇది చికిత్స కాదని స్పష్టం చేస్తున్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కిడ్నీ స్టోన్ ఉన్నవారు సరైన వైద్య సలహా తీసుకోవాలి. స్వయంగా బీర్ వంటి ప్రయోగాలు చేయడం ఆరోగ్యానికి ప్రమాదం.