Fatty Liver: కొంచెం తిన్నా కడుపు ఉబ్బుతోందా.? ఫ్యాటీ లివ‌ర్ కావొచ్చు, అల‌ర్ట్ అవ్వండి

Published : Jan 14, 2026, 04:53 PM IST

Fatty Liver: చిన్న చిన్న లక్షణాలను చాలామంది లైట్‌గా తీసుకుంటారు. కానీ అవే కొన్నిసార్లు ఫ్యాటి లివర్ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఆ సంకేతాలను ముందే గుర్తిస్తే పెద్ద సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి కొన్ని ల‌క్ష‌ణాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
గ్యాస్ అనుకుని

తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, స్వల్ప వికారం, తేలికపాటి అసౌకర్యం ఇవన్నీ సాధారణ గ్యాస్ లేదా అసిడిటీ అనుకుంటారు. కానీ కొందరిలో ఇవి లివర్‌కు సంబంధించిన సమస్యల సూచనలు కావచ్చు. ఫ్యాటి లివర్ ప్రారంభ దశలో తీవ్రమైన నొప్పి ఉండదు. అందుకే పొట్ట సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు.

25
తక్కువ తిన్నా పొట్ట బరువుగా అనిపిస్తే

కొద్దిగా తిన్నా పొట్ట నిండిపోయినట్టు, బరువుగా అనిపిస్తే జీర్ణక్రియ మందగించిందని అనుకుంటారు. ఫ్యాటి లివర్ ఉన్నప్పుడు లివర్‌లో కొవ్వు పేరుకుని అది కొద్దిగా పెద్దదవుతుంది. దాంతో చుట్టూ ఉన్న అవయవాలపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడే భోజనం తర్వాత పొట్ట బరువుగా అనిపించేలా చేస్తుంది.

35
కుడివైపు పై భాగంలో అసౌకర్యం

కుడి వైపు పై పొట్టలో తేలికపాటి అసహనం, విచిత్రమైన భావన ఫ్యాటి లివర్‌కు సాధారణ లక్షణం. ఇది తీవ్రమైన నొప్పిలా ఉండదు. పక్కటెముకల కింద ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. వేయించిన ఆహారం తిన్నాక లేదా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఇది ఎక్కువగా అనిపించవచ్చు. చాలామంది దీన్ని గ్యాస్ అనుకుని పట్టించుకోరు.

45
పొట్ట ఉబ్బడం, తరచూ వికారం

ఎక్కువ తినకపోయినా పొట్ట ఎప్పుడూ ఉబ్బినట్టుగా ఉండటం మరో హెచ్చరిక. ఫ్యాటి లివర్ శరీరంలోని కొవ్వు, షుగర్ ప్రాసెస్‌ను ప్రభావితం చేస్తుంది. దాంతో పొట్ట లాగినట్టు అనిపిస్తుంది. అలాగే స్వల్ప వికారం తరచూ వస్తుంటుంది. వాంతులు లేకపోవడంతో ఇది పెద్ద సమస్య కాదనుకుని వదిలేస్తారు.

55
పొట్ట సమస్యలతో పాటు అలసట కలిస్తే జాగ్రత్త

పొట్ట ఇబ్బందులతో పాటు కారణం తెలియని అలసట ఉంటే అది కేవలం జీర్ణక్రియ సమస్య కాదు. ఫ్యాటి లివర్ ఉన్నప్పుడు శరీరం ఎక్కువ శక్తిని లివర్ ఒత్తిడిని తట్టుకోవడానికే వినియోగిస్తుంది. అందుకే చిన్న పనికే అలసట వస్తుంది. ఈ లక్షణాలు నెమ్మ‌దిగా వస్తాయి దీంతో ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యంగా చేసుకుంటారు. కానీ ఒక సాధారణ టెస్ట్‌తో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను ఇట్టే తెలుసుకోవ‌చ్చు.

గమనిక: పైన తెలిపిన    విష‌యాలను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories