Ice apple: కొత్త‌గా పెళ్లైన వారు తాటి ముంజ‌లు క‌చ్చితంగా తినాలి.. ఎందుకో తెలుసా?

Published : May 20, 2025, 06:49 PM IST

వేస‌వి వ‌చ్చిందంటే తాటి ముంజ‌లు క‌చ్చితంగా క‌నిపిస్తాయి. ఒక‌ప్పుడు కేవ‌లం ప‌ల్లెల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ముంజ‌లు ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లో కూడా క‌నిపిస్తాయి. తాటి ముంజ‌ల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
ముంజలతో ఉపయోగం ఏంటి.?

తాటి ముంజ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతుంటారు. వీటిలోని ఔష‌ధ గుణాలు శ‌రీరానికి కావాల్సిన పోష‌కాల‌ను అందిస్తాయి. కాగా కొత్త‌గా పెళ్లి అయిన జంట‌ల‌కు తాటి ముంజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని నిపుణులు అంటున్నారు. ఇంత‌కీ ముంజ‌ల‌కు, దీనికి సంబంధం ఏంటంటే.

27
లైంగిక ఆరోగ్యానికి

తాటి ముంజ‌లు లైంగిక ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. శక్తివంతమైన శరీరం, ఆరోగ్యకరమైన జీవనశైలి లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. తాటి ముంజలతో శారీరక శక్తి పెరిగి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

37
శక్తిని పునరుద్ధరించే సహజ మార్గం

పెళ్లి తర్వాత కొత్త బాధ్యతలు, ప్రయాణాలు, అలసట వల్ల శరీరం నీర‌సంగా మారుతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో తాటి ముంజలు శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ చలువనిస్తుంది. వీటిలో ఉండే సహజ చక్కెరలు అలసటను తగ్గిస్తాయి.

47
జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి

తాటి ముంజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెళ్లైన కొత్త‌లో ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు వ‌స్తాయి. దీనివ‌ల్ల కలిగే అజీర్ణ సమస్యలకు ఇది మంచి పరిష్కారంలా ప‌ని చేస్తుంది.

57
శరీరానికి డీటాక్స్ చేస్తుంది

ఈ ముంజలు సహజమైన డీటాక్సిఫయర్లుగా పని చేస్తాయి. శరీరంలో నుంచి హానికరమైన పదార్థాలను బయటకు పంపి శుభ్రతను మెరుగుపరుస్తాయి.

67
ఇమ్యూనిటీని పెంచుతాయి

తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి కొత్త వాతావరణంలో వచ్చే వైరల్ సంక్రమణల నుండి రక్షణ కల్పిస్తాయి.

77
చర్మానికి తేమను అందిస్తుంది

ఈ ముంజల్లో ఎక్కువగా ఉండే నీరు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహకరిస్తుంది. కొత్త‌గా పెళ్లి అయిన వారు అందంగా క‌నిపించేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories