Fridge Tips: వీటిని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

Published : May 19, 2025, 08:41 PM IST

Fridge Tips: ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?  పలు విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకుంటే..  అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను నిల్వ చేయాలో.. ఏ పదార్ధాలను నిల్వ ఉంచకూడదో ముందుగా తెలుసుకోండి.   

PREV
16
ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు

ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉండే కొన్ని ఐటమ్స్ మన హెల్త్ ని దెబ్బతీస్తాయి. చూడటానికి టేస్టీగా ఉన్నా, ఇవి మనల్ని బద్దకస్తులుగా, లావుగా, అనారోగ్యంగా చేస్తాయి.  ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం.

26
జామ్

జామ్‌లో 70-80% చక్కెర ఉంటుంది. ఇది తియ్యని ఆహారం బ్రెడ్‌కి టేస్ట్ ఇస్తుంది.  కానీ, అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.  ప్రతి రోజు బ్రెడ్ -జామ్ తినడం అంటే ఎంప్టీ కేలరీస్ తో రోజుని మొదలుపెట్టడమే. 

36
ప్యాక్డ్ జ్యూస్

ప్యాక్డ్ జ్యూస్ –  ఇందులో పండ్లు తక్కువ, చక్కెర, ఆసిడ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎక్కువ. ఇవి శక్తిని ఇవ్వడానికి బదులు  బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుతాయి. త్వరగా ఆకలి వేస్తుంది. తత్ఫలితంగా ఎక్కువ తినడం, బరువు పెరగడం వంటి జరుగుతాయి. వీటికి బదులు తాజా పండ్ల రసం లేదా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. 

46
సాస్ అండ్ కెచప్

సాస్, కెచప్ లను టమాటాతో చేసినట్టు అనిపిస్తుంది, కానీ, ఇందులో 50% చక్కెర, ప్రిజర్వేటివ్స్, ఉప్పు ఉంటాయి. ఇందులో ఎలాంటి పోషకాలు ఇవ్వవు.  కేలరీస్ పెంచుతాయి. తక్కువ తిన్నా అధిక బరువు పెరుగుతారు. వీటికి బదులు పుదీనా-పెరుగు లేదా కొత్తిమీర చట్నీ తినడం బెటర్

56
ఐస్ క్రీమ్ లో చక్కెర

ఐస్ క్రీమ్ లో చక్కెర, కొవ్వు, క్రీమ్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి.  కొవ్వు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది.  వీటికంటే ఫ్రోజెన్ ఫ్రూట్ యోగర్ట్ తినడం బెటర్.

66
కూల్ డ్రింక్స్

కూల్ డ్రింక్స్ లో చక్కెరే ఎక్కువ.  ఒక గ్లాసు కూల్ డ్రింక్ లో 7-8 చెంచాల చక్కెర ఉంటుంది. ఇందులో పోషకాలు లేవు. కేలరీస్ మాత్రమే. బొడ్డు, నడుము, తొడల మీద కొవ్వు పెరుగుతుంది. రెగ్యులర్‌గా తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్, బరువు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories