అల్లం ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని అల్లం నీరు తాగడం వల్ల మన శరీరానికి చాలా లాభాలు ఉంటాయి. నిపుణుల సూచనల ప్రకారం, 7 రోజులపాటు దీన్ని పాటించడం వల్ల శరీరంలో 5 ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. అవేంటో చూద్దాం.
ప్రతిరోజు ఉదయం మనం పాటించే చిన్న చిన్న మంచి అలవాట్ల ద్వారా పెద్ద ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఒక గ్లాసు గోరు వెచ్చని అల్లం నీరు తాగడం వల్ల శారీరక, మానసిక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం 7 రోజులపాటు ప్రతి ఉదయం అల్లం నీరు తాగడం వల్ల కడుపు నుంచి చర్మ ఆరోగ్యం వరకు అనేక మార్పులు చూడవచ్చని అంటున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
26
పేగుల ఆరోగ్యం
అల్లం నీరు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్ణం లేదా కడుపు నొప్పితో బాధపడేవారికి అల్లం నీరు మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం నీరు పరోక్షంగా ఆహారాన్ని సరైన రీతిలో శక్తిగా మార్చడానికి, శరీరాన్ని తేలికగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
36
రక్త శుద్ధికి..
నిపుణుల ప్రకారం.. అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. శుద్ధి అయిన రక్తం అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది. అంతేకాదు రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం వల్ల శక్తి, ఉత్సాహం కూడా పెరుగుతాయి.
అల్లం సహజంగా యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అల్లం నీరు తాగడం వల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందుతుంది. జలుబు, దగ్గు, శక్తి హీనత వంటి సాధారణ సమస్యలు తగ్గుతాయి. 7 రోజుల పాటు క్రమం తప్పకుండా అల్లం నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి స్థిరంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
56
లివర్ పనితీరుకు..
శరీరంలో విష పదార్థాలు ఉండడం వల్ల అలసట, విసుగు వంటి సమస్యలు రావచ్చు. అల్లం సహజంగా డిటాక్సిఫైయింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి విషపదార్థాలను బయటకు పంపుతుంది. ముఖ్యంగా లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా శరీరం తేలికగా, ఉత్సాహంగా, శక్తిమంతంగా మారుతుంది.
66
శక్తి, ఫోకస్ పెరగడానికి..
నిపుణుల ప్రకారం 7 రోజులపాటు ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. ఉదయం వచ్చే అలసట తగ్గి, తక్షణ శక్తి లభిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫోకస్ పెరుగుతుంది. రోజువారీ పనులు, చదువు, వ్యాయామం వంటి కార్యకలాపాల్లో మరింత చురుకుగా ఉంటారు. అల్లం నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే, శరీరానికి దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.