Turmeric Milk: 20 రోజులపాటు పసుపు పాలు తాగితే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!

Published : Feb 11, 2026, 05:06 PM IST

పసుపులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపును పాలల్లో వేసుకొని తాగితే జలుబు నుంచి నిద్ర వరకు చాలా సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా 20 రోజులపాటు పసుపు పాలు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇక్కడ చూద్దాం. 

PREV
15
Turmeric Milk Benefits

సంప్రదాయ వైద్యంలో పసుపు పాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటిని 20 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పసుపులో ఉండే కర్క్యూమిన్, శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పాలల్లో పసుపును కలిపి తీసుకుంటే కర్క్యూమిన్ శరీరానికి మెరుగ్గా అందుతుంది. 20 రోజులపాటు పసుపు పాలు తాగడం వల్ల తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో పసుపు పాలు ఒక ఔషధంలా పనిచేస్తాయని సూచిస్తున్నారు.

25
ఎముకల బలోపేతానికి..

నిపుణుల ప్రకారం పాలలో ఉండే కాల్షియం, విటమిన్ D ఎముకలను బలపరుస్తాయి. దీనికి తోడు పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పులు, కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. రోజంతా పని చేసి అలసిపోయినవారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు 20 రోజులపాటు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే క్రమంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

35
ఈ సమస్యలు దూరం

పసుపు జీర్ణవ్యవస్థకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచి, జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. పాలు కడుపులో చల్లదనాన్ని పెంచే గుణం కలిగి ఉండటం వల్ల అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. 20 రోజులపాటు పసుపు పాలు తాగితే మలబద్ధకం సమస్య తగ్గి, కడుపు తేలికగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

45
మెరుగైన నిద్ర

పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. పసుపు పాలు రాత్రి పడుకునే ముందు తాగితే ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. 20 రోజులపాటు ఈ అలవాటు కొనసాగిస్తే నిద్రలేమి, టెన్షన్ వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

55
గాయాలు, వాపు తగ్గడానికి

నిపుణుల ప్రకారం పసుపు సహజమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. చిన్నపాటి గాయాలు, కండరాల గాయాలు, లోపలి వాపులు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. క్రీడాకారులు లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు 20 రోజులపాటు పసుపు పాలు తాగితే రికవరీ వేగంగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే డయాబెటిస్, పాల అలెర్జీ, గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తాగేముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories