ఎముకల బలహీనత:
కాల్షియం లోపానికి ప్రధాన లక్షణం ఎముకల బలహీనత. ఎముకలు ఆస్టియోపోరోసిస్ అనే స్థితికి చేరుకుని.. చాలా బలహీనంగా మారి, చిన్న గాయానికే విరిగిపోయే అవకాశం ఉంది.
కండరాల నొప్పి, బిగుసుకుపోవడం:
కాళ్లు, చేతులు, వీపులో కండరాల నొప్పి లేదా బిగుసుకుపోవడం తరచుగా జరుగుతుంది.
పళ్ళు బలహీనపడటం:
పళ్లు తేలికగా విరిగిపోవడం, క్షయం రావడం వంటి సమస్యలు రావచ్చు.
అలసట: ఏ పనీ చేయలేనంత అలసటగా అనిపిస్తుంది.
చర్మం, జుట్టు, గోళ్లలో మార్పులు:
చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గోళ్లు విరిగిపోవడం వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలు కావచ్చు.
మానసిక స్థితిలో మార్పులు:
కొందరికి మానసిక ఆందోళన, చిరాకు వంటివి కూడా రావచ్చు.
పిల్లలు:
కాల్షియం లోపం ఉన్న పిల్లలకు పళ్లు ఆలస్యంగా వస్తాయి. ఎదుగుదల ఆగిపోవచ్చు.