నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అందుకే మనం చాలా రకాల వంటకాల్లో నెయ్యిని వాడుతుంటాం. అయితే నెయ్యిని డైరెక్ట్ గా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా గోరువెచ్చని నీరు, నెయ్యి విడివిడిగా రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే వీటిని కలిపి తీసుకోవడం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి, కడుపు సంబంధిత సమస్యలు తగ్గడానికి నెయ్యి చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం.. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
27
జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది:
రాత్రిపూట నెయ్యి, గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి, గోరువెచ్చని నీరు మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుందట. గ్యాస్, ఆమ్లత, మలబద్ధకం వంటి సమస్యలు వెంటనే తగ్గుతాయట.
37
నాణ్యమైన నిద్రకు:
ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రి 1, 2 అయినా కొందరికి నిద్ర పట్టదు. అయితే ఇలా నిద్ర సమస్య ఉన్నవారికి నెయ్యి చక్కని పరిష్కారం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు మెదడుకు విశ్రాంతినిచ్చి.. గాఢ నిద్రకు దోహదం చేస్తాయట.
నెయ్యి ఎముకలు, కీళ్లకు మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఇతర పోషకాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు కీళ్ల వాతం వంటి సమస్యను తగ్గించడంలో నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
57
చర్మంలో సహజ కాంతి:
నెయ్యి చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. శరీరాన్ని లోపలి నుంచి తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో నెయ్యిని కలిపి తాగడం వల్ల.. విష పదార్థాలు బయటకుపోతాయి. చర్మానికి సహజ మెరుపు, మృదుత్వం లభిస్తుంది. చర్మంపై ముడతలు తగ్గించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
67
బరువు తగ్గడానికి:
నిపుణుల ప్రకారం.. బరువు తగ్గడానికి నెయ్యి చక్కగా పనిచేస్తుంది. అయితే సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. నెయ్యి సరైన మోతాదులో తీసుకుంటే జీవక్రియ పెరిగి, కొవ్వు కరిగి, బరువు నియంత్రణలో ఉంటుంది.
77
మెదడు శక్తిని పెంచుతుంది:
నెయ్యిలో ఉండే ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు.. నరాల కణాలను బలోపేతం చేస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి.. నెయ్యిని సరైన పద్ధతిలో సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు తప్పా హాని కలగదు.