ఉదయం లేదా సాయంత్రం..
తినడానికి ముందు ఉదయంపూట నడవడం..
ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఆ సమయంలో కడుపు ఖాళీ గా ఉండటం వల్ల, నడవడానికి శక్తి శరీరంలోని ఫ్యాట్ నుంచి లభిస్తుంది. ప్రతిరోజూ మీరు ఉదయం పూట క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు చాలా సులభంగా తగ్గడానికి సహాయం చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఉదయం పూట నడక చాలా మంచిది.
నడవడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, మానసిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. రెగ్యులర్ గా వాకింగ్ చేసే వారికి మానసిక స్పష్టతను కూడా అందిస్తుంది. భోజనానికి అరగంట ముందు నడవడం మీ దృష్టిని పెంచుతుంది. పది నిమిషాలు నడవడం వల్ల మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.