Shravan Masam: శ్రావణంలో ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి

Published : Jul 06, 2025, 11:58 AM IST

Shravan Masam: పవిత్రమైన శ్రావణ మాసంలో కొన్ని ఆహారాలను తీసుకోకూడదని చెబుతారు. ఇది మతపరమైన అంశం అనిపించినా, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలున్నాయని అర్థం చేసుకోవాలి. శ్రావణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

PREV
16
శ్రావణ మాస ప్రత్యేకత

హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.ఈ పవిత్ర మాసంలో కొన్ని ఆహారాలు మానాలని పెద్దలు చెబుతారు. ఇది కేవలం మతపరమైన ఆచారమే కాదు, శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.

26
పాల ఉత్పత్తులు వద్దు

శ్రావణ మాసంలో పాల ఉత్పత్తులు తినకూడదనే సూచనకు శాస్త్రీయ కారణం ఉంది. ఈ కాలంలో వర్షాల వల్ల గడ్డి మొక్కలు.. క్రిములు, ఫంగస్‌తో కలుషితమై ఉంటాయి. ఆవులు, గేదెలు ఇవే తినడం వల్ల వాటి పాలలో మానవ శరీరానికి హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశముంది.  అందుకే ఈ కాలంలో పాల ఉత్పత్తులను మితంగా లేదా పూర్తిగా దూరం పెట్టడం మంచిదని పెద్దలు చెబుతారు. 

36
పెరుగు

వర్షాకాలంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పెరుగు లాంటి చల్లదనమైన ఆహారాలు తీసుకుంటే జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా, పెరుగు వల్ల శరీరంలో తేమ స్థాయి మరింత పెరిగి, కొందరికి జీర్ణ సమస్యలు, బలహీనతలు ఏర్పడతాయి. అందుకే ఈ సమయంలో పెరుగు వాడకూడదని సూచిస్తారు.

46
వెల్లుల్లి

ఆయుర్వేదం ప్రకారం వర్షాల వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వేడి ప్రకృతిని కలిగి ఉంటాయి, వీటిని తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

56
వంకాయ

చరక సంహిత ప్రకారం శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని పేర్కొనబడింది. వంకాయ స్వభావతా జీర్ణక్రియపై ప్రభావం చూపే ఆహారంగా భావించబడుతుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల కీటకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.

వంకాయలు సులభంగా ఈ క్రిముల ప్రభావానికి గురవుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లు, అజీర్ణం, చర్మ సమస్యలు వచ్చే అవకాశం పెంచుతుంది. అందుకే శ్రావణ మాసంలో వంకాయ తినడం తగ్గించాలని  ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది.

66
ఆకుకూరలు

సుశ్రుత సంహిత ప్రకారం.. శ్రావణ మాసంలో ఆకుకూరల వాడకాన్ని తగ్గించాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ కాలంలో వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉండటంతో, ఆకుకూరలపై క్రిములు, ఫంగస్, సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి. 

ఇవన్నీ శరీరానికి హానికరమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. పైగా, ఆకుకూరలు తేమను ఉత్పత్తి చేసే స్వభావం కలిగి ఉండటంతో, అజీర్ణం, అలర్జీలు, వాంతులు, డయేరియా వంటి సమస్యలు ఏర్పడవచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories