మనలో చాలామంది ఫుడ్ ని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తింటుంటారు. కొందరైతే ఫ్రిడ్జ్ లో పెట్టిన కర్రీలు కూడా తీసి రీహీట్ చేసుకొని తింటారు. అలా చేయడం వల్ల ఫుడ్ వేడిగా, రుచిగా అనిపించినా.. అవి తినడం ఎంత ప్రమాదమో తెలిస్తే ఇంకెప్పుడు ఫుడ్ ని రీహీట్ చేయరు.
ప్రస్తుత బిజీ లైఫ్ లో టైంని ఆదా చేసుకోవడానికి చాలామంది ముందుగానే ఫుడ్ వండేసి ఫ్రిజ్ లో పెట్టి.. అవసరమైనప్పుడు తీసుకొని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారు. ఇది సులభమైన మార్గం అనిపించినా, ఆరోగ్యపరంగా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ప్రతి ఆహారం రీహీట్ చేసినప్పుడు ఒకే విధంగా ఉండదు. కొన్ని పదార్థాలు రెండోసారి వేడి చేస్తే వాటిలోని పోషకాలు నశిస్తాయి. మరికొన్ని ప్రమాదకరమైన రసాయనాలుగా మారుతాయి. మనకు తెలియకుండానే అవి శరీరంలోకి చేరి అనేక సమస్యలకు కారణమవుతాయి. మరి ఏ ఆహారాలను రీహీట్ చేయకూడదో ఇక్కడ చూద్దాం.
27
బంగాళదుంప
బంగాళదుంపలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వండి చల్లార్చిన తర్వాత మళ్లీ వేడి చేస్తే, ఆ స్టార్చ్ రసాయనంగా మారుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన బంగాళాదుంప కర్రీ లేదా ఫ్రైని రీహీట్ చేయడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినం అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
37
అన్నం
చాలామంది ఉదయం వండిన అన్నాన్ని, మధ్యాహ్నం లేదా రాత్రి రీహీట్ చేసుకొని తింటుంటారు. కానీ రైస్ లో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వండిన తర్వాత కూడా స్పోర్స్ రూపంలో బతికే అవకాశం ఉంటుంది. రైస్ ని ఎక్కువ సేపు బయట ఉంచి, తర్వాత మళ్లీ వేడి చేస్తే ఈ బ్యాక్టీరియా టాక్సిన్‌లుగా మారుతుంది. దానివల్ల వాంతులు, విరేచనాలు కావచ్చు. కాబట్టి అన్నాన్ని అలాగే తినడం మంచిది.
పాలు, టీ, పన్నీర్ వంటి వాటిని మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం. పాలు రీహీట్ చేసినప్పుడు అందులోని ప్రోటీన్ నిర్మాణం మారిపోతుంది. పాలపై పచ్చటి పొర ఏర్పడుతుంది. ఆ సమయంలో ప్రమాదకర రసాయనం తయారవుతుంది. అలాగే పెరుగు వేసిన కర్రీలను కూడా మళ్లీ వేడి చేస్తే వాటిలోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అది కడుపు నొప్పి , అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
57
గుడ్లు
గుడ్లను కూడా రీహీట్ చేయకూడదు. గుడ్లు ఎక్కువ వేడికి గురైనప్పుడు అందులోని ప్రోటీన్ టాక్సిక్ స్థితికి చేరుతుంది. ఒకసారి వండిన తర్వాత గుడ్డు కర్రీ లేదా ఆమ్లెట్‌ను మళ్లీ వేడి చేస్తే, వాటిలోని సల్ఫర్, ఐరన్ కలిసి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల కడుపు నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
67
కూరగాయలు
పాలకూర, బీట్‌రూట్, క్యారెట్, కాబేజీ వంటి కూరగాయల్లో నైట్రేట్ ఉంటుంది. వీటిని వండి చల్లార్చిన తర్వాత మళ్లీ వేడి చేస్తే, నైట్రేట్‌లు “నైట్రైట్”గా మారి రక్తంలో ఆక్సిజన్ సరఫరాను తగ్గించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు లేదా గర్భిణీలకు ఇది హానికరం. అందుకే ఆకుకూరలను వండిన వెంటనే తినడం మంచిది.
77
నాన్ వెజ్
చికెన్, మటన్ ఇతర నాన్ వెజ్ వంటకాలు కూడా రీహీట్ చేయడం వల్ల ప్రమాదకరంగా మారవచ్చు. చికెన్‌లోని ప్రోటీన్ రెండోసారి వేడి చేసినప్పుడు దాని నిర్మాణం మారి జీర్ణం కాని స్థితికి చేరుతుంది. ఫ్రిజ్‌లో ఉంచి, మళ్లీ వేడి చేయడం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వంట చేసేటప్పుడు అవసరమైనంత మాత్రమే వండుకోవడం ఉత్తమం. మిగిలిపోయిన ఆహారాన్ని రీహీట్ చేయడం తప్పనిసరి అయితే, ఒకసారి మాత్రమే చేయాలి. రెండు మూడు సార్లు వేడి చేయడం ప్రమాదకరం. అలాగే రీహీట్ చేసిన ఆహారాన్ని వెంటనే తినాలి. మళ్లీ చల్లారనివ్వకూడదు.