యూకలిప్టస్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా కూడా ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది శ్వాసనాళాలలో ఉండే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, శ్వాసనాళాల వాపులను తగ్గించి, కఫాన్ని కరిగించి, శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. నిద్రపోయేటప్పుడు ఒక కర్చీఫ్ మీద కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, దానిని ముక్కుకు దగ్గరగా పెట్టుకుని పీల్చడం. లేదా.. మరుగుతున్న నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి, ఆ వచ్చే ఆవిరిని బాగా పీల్చడం. ఈ పద్ధతులు శ్వాసనాళాలను క్లియర్ చేసి, ఊపిరి సజావుగా పీల్చుకోవడానికి దోహదపడతాయి.