Fish Thorn: చేపలు తింటూ గొంతులో ముల్లు ఇరుక్కోవడం చాలా సాధారణం. కొంతమందికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ భయంతో చాలా మంది చేపలు తినరు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే అరటిపండు తినడం కాకుండా ఇంకా ఏమి చేయవచ్చు? ఎలా చేప ముల్లును తీసేయవచ్చు ?
చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోతే తొలుత భయపడటం సహజమే, కానీ ఆ భయం వల్ల సమస్య మరింత దిగజారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా కీలకం. తొందరపడి ఏది పడితే అది తినడం లేదా ముల్లును తీయడానికి ప్రయత్నించడం ప్రమాదకరం. ఆ ముల్లు మరింత లోతులోకి వెళ్లిపోవచ్చు లేదా గొంతును గాయపర్చవచ్చు.
కంగారుపడకుండా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. మనసును ప్రశాంతపరచుకోవడం వల్ల.. ఏమి చేయాలో స్పష్టంగా ఆలోచించడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
వీలైతే అద్దం ముందు నిలబడి వెలుతురులో గొంతును పరిశీలించండి. ముల్లు బయటికి కనిపిస్తే దాన్ని గుర్తించవచ్చు. కానీ, దాన్ని తీయడానికి స్వయంగా ప్రయత్నించకండి, ఎందుకంటే మీరు ముల్లును గట్టిగా నెట్టేయడం వల్ల అది మరింత లోపలకి వెళ్లే ప్రమాదం ఉంది.
27
దగ్గడం
చిన్న చేప ముల్లు గొంతులో ఇరుక్కున్నప్పుడు దగ్గడం వల్ల అది బయటకు రావచ్చు. బలంగా దగ్గడం కన్నా నోరు తెరిచి, కొంచెం ముందుకు వంగి దగ్గితే ముల్లు కదలడానికి మరింత సహాయపడుతుంది. ఈ ప్రయత్నంతో ఎలాంటి మార్పు లేకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
37
అన్నం లేదా ఇడ్లీ
చిన్న ముల్లు గొంతులో ఇరుక్కున్నప్పుడు నమలకుండా అన్నం లేదా ఇడ్లీని నెమ్మదిగా మింగడం ద్వారా ముల్లును కడుపు వైపు నెట్టవచ్చు. ఇవి ముల్లును లాగేసుకుంటూ లోపలికి దిగిపోయేలా సహాయపడతాయి. అన్నం లేదా ఇడ్లీ అందుబాటులో లేకపోతే, నానబెట్టిన బ్రెడ్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది జాగ్రత్తగా, మెల్లగా చేయాలి.
అరటిపండు సహజంగా మెత్తగా, జారుడుగా ఉండటం వల్ల చేప ముల్లును కిందికి నెట్టడానికి సహాయపడుతుంది. అరటి పండును నమలకుండా నెమ్మదిగా మింగితే, ముల్లు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మెత్తటి మామిడి, పండిన బొప్పాయి వంటి పండ్లు కూడా ఇలా ఉపయోగించవచ్చు. ఇవి గొంతుకు ఇబ్బంది కలిగించకుండా, ముల్లును కదల్చడంలో సహాయపడతాయి. అయితే ఈ పద్ధతులు చాలా జాగ్రత్తగా చేయాలి
57
నీళ్ళు తాగడం
గొంతులో ముల్లు ఇరుక్కున్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు తాగడం మంచిది. ఇది ముల్లును తడిపి, దాని చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు, నీళ్లు తాగే సమయంలోనే ముల్లు కిందికి పోవచ్చు. అయితే చల్లటి నీటి వల్ల గొంతు కుంచించుకపోయే అవకాశం ఉంది. నెమ్మదిగా తాగడం వల్ల ముల్లు కదిలే అవకాశం పెరుగుతుంది. అయినా మార్పు లేకపోతే వైద్య సాయం అవసరం.
67
తేనే లేదా ఆలివ్ ఆయిల్
గొంతులో ముల్లు ఇరుక్కున్నప్పుడు.. ఒక చెంచా తేనె లేదా ఆలివ్ నూనెను నెమ్మదిగా మింగడం ఉపశమనానికి సహాయపడుతుంది. తేనె గొంతును మృదువుగా చేసి ముల్లు లోపలికి పోవడానికి సహకరిస్తుంది, ఆలివ్ నూనె తాగడం వల్ల కూడా ముల్లును తొలగించడానికి సహాయపడుతుంది. ఇవి రెండూ గొంతులో రక్షణ పొరను ఏర్పరిచి రాపిడిని తగ్గిస్తాయి. అలాగే, వేడి పాలలో తేనె కలిపి తాగవచ్చు.
77
ఇవి అస్సలు చేయకూడదు
గొంతులో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు చేయకూడని పనులు :
వేలు పెట్టి ముల్లును తీయాలని ప్రయత్నించకండి. ఇది ముల్లును మరింత లోపలికి నెట్టవచ్చు, గాయం పెరిగి రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.
టూత్ బ్రష్, కర్ర, లేదా పదునైన వస్తువులు ఉపయోగించవద్దు.
భయంతో అరవడం లేదా శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే.. కండరాలు సడలి, ముల్లు బయటకు రావడానికి అవకాశముంటుంది.
చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినడం తప్పనిసరి. త్వరగా తినడం వల్ల ముల్లు ఇరుక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.