పెరుగుతో ఆలివ్ విత్తనాలు కలిపి తీసుకుంటే..
పెరుగులో కూడా శరీరానికి ఆరోగ్యకరమైన అనేక పోషకాలుంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరంలోని కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మత్తుకు సహాయపడతాయి. అదేవిధంగా, ఇందులో సమృద్ధిగా ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ ప్రేగులలో హెల్తీ బ్యాక్టీరియాను పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
పెరుగుతో ఆలివ్ విత్తనాలను కలిపి తీసుకుంటే.. మరింత ప్రయోజనాలు పొందవచ్చు. ఆలివ్ విత్తనాల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీని వల్ల రక్తపోటు స్థిరంగా ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అంతేకాక, ఆలివ్ విత్తనాల్లో ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. ఈ మిశ్రమం ద్వారా శరీరానికి సమపాళ్లలో ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, ప్రోబయోటిక్స్ లభించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.