Pomegranate: రోజుకో దానిమ్మ పండు తింటే ఏమవుతుంది? ఎవరు అస్సలు తినకూడదు?

Published : Jan 14, 2026, 11:34 AM IST

దానిమ్మ పండ్లు రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. రోజూ ఒక దానిమ్మ పండు తింటే చర్మం నుంచి గుండె వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. ఎవరు తినకూడదో ఇక్కడ చూద్దాం.   

PREV
16
దానిమ్మ పండు ప్రయోజనాలు

దానిమ్మలో పోషకాలు ఎక్కువ. రోజూ ఒక దానిమ్మ పండు తింటే ఎన్నో వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. దానిమ్మలోని పాలీఫెనాల్స్, విటమిన్ సి.. కణాల నష్టాన్ని, ఆక్సిడేటివ్ ఒత్తిడిని నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి.

26
దానిమ్మ రసం

దానిమ్మ రసం రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి, వాపును తగ్గించడంతో పాటు HDL కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగుపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

36
పేగుల ఆరోగ్యానికి

దానిమ్మ పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ దానిమ్మ తినడం వల్ల వాపు, కీళ్ల నొప్పులు, బిగుసుకుపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

46
రోగనిరోధక శక్తి

దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దానిమ్మలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి.. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి. అంతేకాదు దానిమ్మలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

56
రక్తం గడ్డకట్టకుండా..

దానిమ్మ రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణకు, లైంగిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు రక్తహీనత సమస్యతో బాధపడేవారికి దానిమ్మ మంచి పరిష్కారం. ఇందులో ఉండే ఐరన్ హీమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి సహాయపడుతుంది. 

66
ఎవరు తినకూడదంటే?
  • దానిమ్మ బీపీని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి బీపీ తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు.  
  • దానిమ్మ కొన్ని మందుల ప్రభావాన్ని మార్చవచ్చు. కాబట్టి ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. 
  • కొంతమందికి దానిమ్మ తింటే దురద, వాంతులు, నోటి వాపు లాంటి అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
  • కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు దానిమ్మ తినకపోవడమే మంచిది.
  • డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మను ఎక్కువ మోతాదులో తినకూడదు. డాక్టర్ సూచనతో తినడం మంచిది.
Read more Photos on
click me!

Recommended Stories