ఆకుకూరలు కూడా కంటి చూపు మెరుగుపడానికి ఎంతో మేలు చేస్తాయి. బచ్చలికూర, కాలే, తోటకూర వంటి ఆకుకూరలలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో పుష్కలంగా ఆకుకూరలు చేర్చుకోండి. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఒమేగా-3 ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికే కాదు. శరీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం.