Brushing Tips: బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే.. జాగ్రత్త!

Published : Jun 29, 2025, 01:30 PM IST

Brushing Tips: ఉదయం లేచిన వెంటనే చేసే పనుల్లో పళ్ళు తోముకోవడం ఒకటి. అయితే చాలా మంది బ్రష్‌పై ఎంత టూత్‌పేస్ట్ వేస్తున్నారో? టూత్‌పేస్ట్ వేసే ముందు బ్రష్‌ని క్లీన్ చేస్తున్నారా? అనే విషయాలను పాటించుకోరు. ఈ చిన్న తప్పిదాల వల్ల దంతాలకు హాని కలుగుతుందట.

PREV
15
బ్రష్ చేసేటప్పుడు చేసే తప్పులు

దంతాలు శుభ్రం, దృఢంగా ఉండాలంటే.. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  అయితే రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేశామన్న దానికంటే.. ఎంతసేపు బ్రష్ చేశామనేది ముఖ్యమట. అలాగే.. బ్రష్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

25
బ్రషింగ్ పద్ధతి

దంత వైద్యుల ప్రకారం.. చాలామంది బ్రషింగ్ చేసేటప్పుడు పలు విషయాలల్లో పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు. బ్రష్ చేయడానికి ముందు కొందరు నోరు పుక్కిలిస్తారు.  టూత్ బ్రష్ ని కడిగి తర్వాత పేస్ట్ పెట్టుకుని పళ్లు తోముతారు. ఇది పెద్ద పొరపాటు అని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

35
బ్రష్ తడుపుతున్నారా ?

బ్రష్ చేసే ముందు టూత్ బ్రష్ ని తడపడం వల్ల టూత్ పేస్ట్ డైల్యూట్ అయిపోతుందట. నోటిలో కావాల్సినంత తేమ ఉంటుంది. బ్రష్ తడి చేసే.. త్వరగా నురగ పైకి తేలుతుంది. అందువల్ల త్వరగా ఉమ్మేయ్యాల్సి వస్తుంది. ఫలితంగా బ్రషింగ్ సరిగ్గా చేసిన అనుభూతి ఉండదు.  అలాగే.. సరైన ఫలితం అందదు అని వైద్యులు చెబుతున్నారు.

45
ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి ?

దంతాలు శుభ్రం చేసేందుకు మొనతేలిన బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ను అస్సలు వాడకూడదు. మృదువుగా బ్రిసిల్స్ ఉన్న బ్రష్  మాత్రమే వాడాలి. బ్రిసిల్స్ అన్ని మూలల్లో శుభ్రం చేసేవిధంగా ఉండాలని డెంటిస్టులు సూచిస్తారు. అలాగే దంతాల వెనుక భాగం ముందుగా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

55
ఎన్ని సార్లు బ్రష్ చేయాలి ?

రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం మంచిది. కానీ, రోజుకు ఒక్కసారైనా బ్రష్ సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది. దంతక్షయం, చిగుళ్ల వ్యాధి రాకుండా ఉండడానికి, ప్రతిరోజూ కనీసం రెండు నిమిషాల పాటు మీ దంతాలను బ్రష్ చేయండి. అలాగే ఫ్లాస్ చేయండి

Read more Photos on
click me!

Recommended Stories