Egg For Heart Health : రోజుకు ఒక గుడ్డు తింటే గుండె జబ్బులు రావా..?
Egg For Heart Health : పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తింటే గుండె జబ్బులు (Heart disease) తగ్గుతాయట.

గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే గుడ్డులో ఎన్నో పోషకవిలువలున్నాయి. ఇది సంపూర్ణ ఆహారం కూడా. వీటిలో విటమిన్ బి, విటమిన్ డి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు, సల్ఫర్ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి.
అయితే చాలా మంది గుడ్డును తింటే బరువు పెరిగిపోతామని.. గుడ్డు వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని దీనివల్ల గుండెకు ప్రమాదమని తినడం మానేస్తుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
వాస్తవానికి గుడ్డులో లిపోప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఎటువంటి నష్టం జరగదు.
అందులోనూ రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని ఒక అధ్యయనం స్ఫష్టం చేస్తోంది. గుడ్లను మితంగా తీసుకోవడం వల్ల గుండెకు ఏవిధంగా మంచి జరుగుతుందనే విషయంపై పరిశీలించారు. ఈ అధ్యయనం ఈఎల్ఈఎఫ్ జర్నల్ లో ప్రచురితమైంది.
గుడ్లు వివిధ రకాల ఆవశ్యక పోషకాలను కలిగి ఉంటాయి. గుడ్లు తినడం గుండె ఆరోగ్యానికి లాభ దాయకమా లేదా హానికరమా అనే దానికి విరుద్ధమైన ఆధారాలు ఉన్నాయి. 2018 లో జర్నల్ హార్ట్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ గుడ్లు తినేవారికి గుండె జబ్బులు (Heart disease), స్ట్రోక్ (Stroke) అభివృద్ధి చెందే ప్రమాదం చాలా తక్కువ అని కనుగొన్నారు.
గుడ్డు వినియోగం మరియు గుండె జబ్బుల ప్రమాదం మధ్య సంబంధంలో.. ప్లాస్మా కొలెస్ట్రాల్ జీవక్రియ పోషిస్తున్న పాత్రను అధ్యయనాన్ని పరిశీలించినట్లు బీజింగ్ లోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్ విభాగం అధిపతి లాంగ్ పాన్ చెప్పారు.
ఒక మాదిరి మొత్తంలో గుడ్లు తిన్న వ్యక్తులు.. వారి రక్తంలో 'అపోలిపోప్రొటీన్ ఎ 1' అని పిలువబడే ప్రోటీన్ యొక్క అధిక స్థాయిలను కలిగి ఉన్నారని తేలింది. 'మంచి లిపోప్రొటీన్' అని కూడా పిలువబడే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్ డీఎల్) రక్త నాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడుతుందని అధ్యయనం కనుగొంది.
"గుడ్లు మితంగా తినడం వల్ల గుండె జబ్బుల నుండి రక్షించడానికి ఎలా సహాయపడుతుందో మా అన్వేషణ సూచిస్తుంది" అని పరిశోధకులు తెలిపారు. గుడ్డు వినియోగం మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం మధ్య సంబంధంలో లిపిడ్ జీవక్రియలు పోషించే పాత్రను పరిశీలించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు తెలిపారు.