Control Blood Pressure: స్నానం ముందు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ అవుతుందా? ఇందులో నిజమెంత?

Control Blood Pressure: స్నానం చేసే ముందు నీళ్లు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమా? అబద్ధమా? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

Does Drinking Water Before Bathing Really Control Blood Pressure in telugu sns

స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరం అనేక రకాలుగా రక్షణ పొందుతుంది. స్నానం మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఏముందంటే స్నానం చేసే ముందు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పారు. ఇది వైరల్ కావడంతో స్నానం చేసే ముందు నీళ్లు తాగితే బీపీ తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇందులో ఎంత నిజముందో డాక్టర్ల సూచనలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం.  

Does Drinking Water Before Bathing Really Control Blood Pressure in telugu sns

అరగంట ముందు నీళ్లు తాగండి

స్నానం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ అవుతుందని యూట్యూబ్ వీడియో ఉంది. ఇదే కాకుండా స్నానం చేసే ముందు నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, నీళ్లు తాగే ఈ అలవాటు బీపీకి మాత్రమే కాదు గుండెకు కూడా మంచిదని వీడియోలో చెప్పారు. 
 


డాక్టర్లు ఏమన్నారంటే..

ఈ విషయాలను కొందరు ప్రముఖ డాక్టర్ల దగ్గర ప్రస్తావించగా స్నానం చేయడానికి ముందు నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందనడం అబద్ధమని చెప్పారు.

కానీ ఈ సమయంలో నీళ్లు తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుందన్నారు. రక్త పరిమాణం కూడా మెరుగుపడుతుంది అని డాక్టర్లు చెప్పారు.
 

తాత్కాలిక ప్రయోజనం మాత్రమే

మీరు ఎక్కువ నీళ్లు తాగితే కొంతసేపటి వరకు రక్త పరిమాణం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది బ్లడ్ ప్రెషర్ ని తాత్కాలికంగా మాత్రమే తగ్గిస్తుంది. అది కూడా కొద్దిసేపు మాత్రమే. కేవలం నీళ్లు తాగినంత మాత్రాన బీపీ తగ్గదని ప్రజలు గుర్తించాలని డాక్టర్లు తెలిపారు.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు స్నానానికి ముందు నీళ్లు తాగడం అలవాటుగా చేేసుకుంటే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని భావించకూడదని సూచించారు. 

బీపీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి?

రక్తపోటు తగ్గడానికి వైద్య చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చేయగలిగినంత వాకింగ్, కారాలు ఎక్కువ తినకుండా ఉండటం, తదితర ఆహార, ఆరోగ్య సూత్రాలు పాటిస్తే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 

ఇది కూడా చదవండి కర్బూజ గింజలు పాడేయకండి. వీటిని తింటే ఎన్ని లాభాలో తెలుసా!

Latest Videos

vuukle one pixel image
click me!