Hair care: చుండ్రు తగ్గి.. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ 5 చేస్తే చాలు!

జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. రకరకాల ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం కనిపించదు. సరిగ్గా అలాంటి వారికోసమే మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఓసారి చూసేయండి.

Effective Dandruff Solutions Natural Hair Growth Tips in telugu KVG

జుట్టు సంరక్షణ కోసం చాలామంది రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. అయినా పెద్దగా ఫలితం కనిపించదు. పైగా కెమికల్స్ వాడకం వల్ల కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలామందికి చుండ్రు, జుట్టు రాలడం, తెగిపోవడం, తెల్లబడటం లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మరి వీటిని సహజంగా ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Effective Dandruff Solutions Natural Hair Growth Tips in telugu KVG
చుండ్రు తగ్గడానికి ఏం చేయాలి?

జుట్టులో వచ్చే సగం సమస్యలకు చుండ్రే కారణంగా ఉంటుంది. అయితే జుట్టులో నూనె, మురికి లేకుండా చూసుకుంటే చుండ్రు తగ్గుతుంది. చుండ్రు తగ్గించడానికి సహాయపడే కొన్ని హెయిర్ కేర్ చిట్కాలు ఇక్కడ చూద్దాం.


నిమ్మరసం

నిమ్మరసం చుండ్రు నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం ఒక చెంచా నిమ్మరసం, అర కప్పు పెరుగు కలపాలి. దాన్ని జుట్టుకు పట్టించాలి. తరచూ ఇలా చేయడం ద్వారా చుండ్రును తగ్గించుకోవచ్చు.

కలబంద

కలబంద జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇంటి దగ్గర సులువుగా దొరుకుతుంది. కాబట్టి జుట్టు సంరక్షణకు కలబందను వాడుకోవచ్చు. కలబంద రసం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనెె

కొబ్బరి నూనె, ఆలివ్ నూనె కొద్దిగా వేడి చేసి తలకు పట్టించాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన టవల్‌తో తలను బాగా చుట్టాలి. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు చూస్తారు.

వేప ఆకులు

వేప ఆకులను రుబ్బి తలకు పట్టించి కడగాలి. దీన్ని వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. చుండ్రు తగ్గితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అరటి పండు

ఒక అరటిపండును మెత్తగా చేసి అందులో ఒక చెంచా ఆలివ్ నూనె వేసి పేస్ట్ చేయాలి. తర్వాత ఒక చెంచా పెరుగు వేసి కలపాలి.

గమనిక:

ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీన్ని ఏషియానెట్ న్యూస్ ధృవీకరించడం లేదు.

Latest Videos

vuukle one pixel image
click me!