Tomatoes and Kidney Health: టమాటాలు రోజూ తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? అసలు నిజం ఇదే!

Published : Dec 31, 2025, 06:38 PM IST

వంటింట్లో నిత్యం ఉపయోగించే కూరగాయల్లో టమాట ఒకటి. టమాటాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. రోజూ తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చాలామంది చెబుతుంటారు. ఇంతకీ ఆ మాటల్లో నిజమెంతో? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
టమాటాలు రోజూ తింటే ఏమవుతుంది?

టమాటాలు రోజూ తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయి.. అనే మాట చాలా మందిలో భయం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, ఇంట్లో కొందరు పెద్దవాళ్లు చెప్పే మాటల వల్ల చాలామంది టమాటాలను తినడం తగ్గిస్తున్నారు. నిజానికి టమాటాలలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తింటే ఏమవుతుందో? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.  

26
కిడ్నీలో రాళ్లు రావడానికి కారణం ఇదే

నిపుణుల ప్రకారం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం శరీరంలో మినరల్స్ అసమతుల్యత, తక్కువ నీరు తాగడం, కొన్ని రకాల ఆహారాలు అధికంగా తీసుకోవడం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు. అయితే టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని కొంతమంది ఎందుకు చెబుతున్నారంటే వాటిలో ఉండే ఆక్సలేట్ పరిమాణమే కారణం. సాధారణంగా ఆక్సలేట్ అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడే ప్రమాదం కొందరిలో పెరుగుతుంది. 

36
శాస్త్రీయ ఆధారాలు లేవు

నిజానికి టమాటాల్లో ఆక్సలేట్ ఉన్నా, అది ఎక్కువ మోతాదులో ఉండదు. పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే టమాటాల్లో ఆక్సలేట్ పరిమాణం చాలా తక్కువ. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారు రోజూ టమాటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. 

46
ప్రతికూల ప్రభావం ఉండదు

టమాటాల్లో విటమిన్ C, విటమిన్ A, పొటాషియం, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. లైకోపీన్ అనే పదార్థం శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. సరైన మోతాదులో టమాటాలు తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

56
కిడ్నీ సమస్యలు ఉన్నవారు

ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు లేదా తరచూ రాళ్లు ఏర్పడే హిస్టరీ ఉన్నవారు కొంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వారు టమాటాలను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కానీ మితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

66
సరిపడా నీరు తాగితే

శరీరానికి సరిపడా నీరు తాగితే, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. టమాటాలతో పాటు ఇతర కూరగాయలు, పండ్లు, సమతుల్య ఆహారం తీసుకుంటూ నీటి మోతాదుపై దృష్టి పెట్టడం ముఖ్యం. అలాగే టమాటాలను ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. ఉప్పు ఎక్కువగా వేసిన టమాట పికిల్స్, ఎక్కువ నూనెతో చేసిన టమాట వంటకాలు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories