Cancer: మ‌ల విస‌ర్జ‌న స‌మ‌యంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? క్యాన్స‌ర్ కావొచ్చు..

Published : Dec 28, 2025, 10:07 AM IST

Cancer: ఇటీవ‌ల క్యాన్స‌ర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో పెద్ద‌పేగు క్యాన్స‌ర్ ఒక‌టి. అయితే క్యాన్స‌ర్‌ను ముందుగా గుర్తిస్తే స‌రైన చికిత్స తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ల‌క్ష‌ణాల ఆధారంగా క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. 

PREV
15
పెద్ద‌పేగు (కోలోరెక్టల్) క్యాన్సర్ అంటే ఏంటి?

కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది పేగులలో (కోలన్) లేదా మలద్వారంలో (రెక్టమ్) ఏర్పడే ప్రమాదకరమైన క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రాణాలు తీసే క్యాన్సర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని లక్షణాలు సాధారణ సమస్యలాగా కనిపించడం వల్ల చాలామంది మొదట్లో గుర్తించలేరు. గతంలో ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపించేది. కానీ ప్రస్తుతం యువతలో కూడా ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, చాలా మందిలో ఇది చివరి దశలోనే బయటపడుతోంది.

25
ఆలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు.?

ఈ క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడానికి ప్రధాన కారణం నొప్పి లేకపోవడం. సాధారణంగా మనకు నొప్పి ఎక్కువగా ఉంటేనే సమస్యను సీరియస్‌గా తీసుకుంటాం. కానీ కోలోరెక్టల్ క్యాన్సర్‌లో మొదటి దశల్లో నొప్పి ఉండదు. మల విసర్జనలో మార్పులు వస్తాయి. వాటిని చాలామంది కడుపు పాడవడం, పైల్స్ లేదా సాధారణ జీర్ణ సమస్యలుగా భావించి పట్టించుకోరు. కానీ మల విసర్జన అలవాట్లలో మార్పులు ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు.

35
మల ఆకారంలో మార్పు కనిపిస్తే జాగ్రత్త

మల విసర్జన సమయంలో మలం చాలా పలుచగా, పెన్సిల్‌లా రావడం గమనిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ల మాట ప్రకారం, కోలన్ లేదా రెక్టమ్‌లో ట్యూమర్ పెరిగితే మలం సరిగ్గా బయటకు రావడానికి అడ్డంకి ఏర్పడుతుంది. దీని వల్ల మల ఆకారం మారిపోతుంది. ఈ లక్షణం తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

45
మలంలో మ్యూకస్ లేదా రక్తం

మల విసర్జన సమయంలో జెల్లీలా ఉండే చిక్కటి పదార్థం (మ్యూకస్) ఎక్కువగా రావడం ప్రమాద సంకేతం కావచ్చు. ట్యూమర్ కారణంగా పేగుల లోపలి భాగం వాపు రావడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే మలంలో రక్తం కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు. చాలామంది ఇతర లక్షణాలను పట్టించుకోకపోయినా, రక్తం కనిపించగానే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ఇది ఈ క్యాన్సర్‌కు ముఖ్యమైన హెచ్చరిక సంకేతం.

55
తరచూ డయేరియా లేదా మలబద్ధకం ఉన్నా..

ఎప్పుడూ కడుపు పాడవడం, తరచూ డయేరియా రావడం లేదా ఎక్కువకాలంగా మలబద్ధకం ఉండటం కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలే కావచ్చు. ఈ సమస్యలు సాధారణంగా కనిపించినా, ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. మొదటి దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. ఆలస్యం చేస్తే ఇది శరీరం మొత్తం వ్యాపించి ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories