ఆలుగడ్డలను మరీ ఎక్కువగా తినేయకండి.. లేదంటే ఈ సమస్యలొస్తయ్..

Mahesh Rajamoni | Updated : Sep 15 2023, 07:15 AM IST
Google News Follow Us

ఆలుగడ్డలను కొంతమంది ప్రతి కూరలో వేస్తుంటారు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి కాబట్టి. కానీ ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి వాటిని రోజూ తిన్నా.. లేదా ఎక్కువగా తిన్నా బరువు పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

16
ఆలుగడ్డలను మరీ ఎక్కువగా తినేయకండి.. లేదంటే ఈ సమస్యలొస్తయ్..
Image: Freepik

ఆలుగడ్డలను అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి సమస్యలూ రావు. కానీ మీరు రోజూ వీటిని తిన్నా.. ఎక్కువగా తిన్నా కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలుగడ్డల అలెర్జీ ఉంటే తప్ప ఇవి మీకు ఎక్కువ హాని కలిగించవు. కానీ కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు మాత్రం వస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణమయ్యేది కూడా కష్టమే. అసలు ఆలుగడ్డలను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

బరువు పెరగడం

ఆలుగడ్డల్లో పిండి పదార్థాలు, కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో బంగాళాదుంపలను తినడం వల్ల అలాగే.. అదనపు కొవ్వులు లేదా నూనెలతో తయారు చేసిన వాటిని తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. 
 

36

రక్తంలో చక్కెర చిక్కులు

ఆలుగడ్డల్లో  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీటిని ఎక్కువగా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. 

Related Articles

46
Potatoes

జీర్ణ సమస్యలు

బంగాళాదుంపలను ఎక్కువగా తినడం.. దాని తొక్కతో సహా తింటే మీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కావొచ్చు. ఫైబర్ ను  ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలతో సహా జీర్ణ సమస్యలు వస్తాయి. 

56
potato

దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం

బంగాళాదుంపలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం.. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ లేదా అనారోగ్యకరమైన కొవ్వులతో తయారు చేసిన వాటిని తింటే గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

66

పోషక అసమతుల్యత

కేవలం బంగాళాదుంపల ద్వారానే రోజువారి కేలరీలను తీసుకుంటే మీలో పోషకాలు లోపించే అవకాశం ఉంది. బంగాళాదుంపల్లో పొటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కానీ వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి సమతుల్య ఆహారంలో ఉండే ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండకపోవచ్చు. ఇది పోషకలోపానికి దారితీస్తుంది.      

Read more Photos on
Recommended Photos