క్యారెట్ కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. ఇందులో అధికంగా ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ Aగా మారుతుంది. ఈ విటమిన్ కంటిలోని రెటీనాకు అవసరమైన పోషణ అందిస్తుంది.
Telugu
పాలకూర
పాలకూరలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
Telugu
చిలగడ దుంప
చిలగడదుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఒక చిన్న సైజు చిలగడదుంప తింటే చాలు.. రోజుకి కావలసిన విటమిన్ ఎ లో రెండింతల కంటే ఎక్కువ అందుతుంది.
Telugu
క్యాప్సికం
క్యాప్సికంలో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రేచీకటి సమస్య ఉన్నవారు క్యాప్సికమ్‌ను తరచూ తింటే.. మంచి ఫలితాలు వస్తాయి.
Telugu
టమాటా
టమాటాల్లో ఉండే లైకోపీన్ కళ్ల ఆరోగ్యానికి మంచిది. టమాటాలో లుటీన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటిచూపునకు మద్దతు ఇస్తాయి. కంటిశుక్లం, మాక్యులర్ డీజనరేషన్ నుంచి కళ్లను రక్షిస్తాయి.
Telugu
ఉసిరికాయ
రోజూ ఉసిరికాయ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు. క్యాటరాక్ట్, రెటీనా డిజార్డర్స్ వంటి కంటి సమస్యలను పరిష్కరించడంలో కూడా ఉసిరి సహాయపడుతుంది.
Telugu
గుడ్డు
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కంటి చూపుకు మంచివి.