అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఈరోజుల్లో పొట్ట ఉంది. ఈ పొట్ట వల్ల బాడీ షేప్ మారడమే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే విపరీతంగా తినడం, డ్రింక్స్ ను తాగడం వల్ల పొట్ట పెరుగుతుందని అనుకుంటారు. కానీ..
బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం దొరకడం లేదు. దీనివల్లే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. దీనితో పాటుగా హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ముప్పు కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది.
ఇకపోతే చాలామంది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అది అస్సలు తగ్గదు. నిజం చెప్పాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఫుడ్ ను ఎక్కువగా తినడం, కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగడమే కాకుండా.. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తినడం
కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తినడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు. అంటే ఉదయం వైట్ బ్రెడ్ ను తినడం, మధ్యామ్నం, రాత్రి అన్నాన్ని తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు పెరుగుతాయి. ఇవి మన శరీరంలో గ్లూకోజ్ గా మారుతాయి. అయితే ఈ గ్లూకోజ్ శక్తిగా మారకపోతే శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది. ఈ కొవ్వు ముఖ్యంగా మన పొట్ట చుట్టే పేరుకుపోతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది.
36
నిద్రలేకపోవడం, ఒత్తిడి
కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల కూడా పొట్టపెరిగిపోతుంది. పని ఎక్కువ కావడం, నిద్రలేకోవడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ పెరుగుతుంది. అంతేకాదు దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలున్న వారు ఊబకాయం బారిన తొందరగా పడతారని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది కొవ్వు కరగాలని నడుస్తుంటారు. అదికూడా శరీరాన్ని కదిలించకుండా మెల్లిగా నడుస్తుంటారు. కానీ కొవ్వును కరిగించడానికి ఇలాంటి నడక సరిపోదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు కరగాలంటే గుండె కొట్టుకునే వేగం పెరిగేలా నడవాలి. ఇందుకోసం జాగింగ్, సైక్లింగ్, బ్రిక్స్ వంటి వ్యాయామాలను చేయాలి. వీటివల్ల మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
56
ప్రాసెస్ చేసిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ రుచిగా ఉంటాయి. కానీ వీటిలో ఫైబర్, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉండవు. వీటిని తింటే నోటికి రుచిగా ఉన్నా జీర్ణక్రియ మాత్రం నెమ్మదిస్తుంది. అలాగే వీటివల్ల బరువు పెరుగుతారు.
అలాగే పాల ఉత్పత్తుల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే కూడా బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం, రాత్రి వేళల్లో ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి. ఇవి మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
66
జెనెటిక్స్
కొంతమంది జెనెటిక్స్ వల్ల కూడా బరువు పెరుగుతారు. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఇలా జరగొద్దంటే మాత్రం మీరు మంచి ఆహారాలను తినాలి. ఒత్తిడికి గురికాకుండా ఉంటే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోగలుగుతారు. అలాగే ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం తప్పకుండా చేయాలి.